“అమ్మ నన్ను క్షమించు….చెడు వ్యసనాలకు బానిస అయ్యాను.. మారాలని ఉన్నా మారలేక పోతున్నాను.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను.. నా లాగా మత్తుకు ఎవ్వరూ బానిసలు కాకండి” అని ఓ యువకుడు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామానికి చెందిన నక్క గంగులు, సత్తయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు.. పెద్ద కొడుకు దుబాయికి వెళ్లగా, చిన్నకొడుకు సాయి ఇంటి వద్దనే ఉంటున్నాడు. వ్యవసాయ పనులు జీవించే సాయ కి వివాహం అయ్యి ఒక కొడుకు ఉన్నాడు. సాయి మద్యంతో పాటు ఇతర వ్యసనాలకి బానిస అయ్యాడు. ఎంత చెప్పినా మారకపోవడంతో కొడుకుని తీసుకొని భార్య దీక్షిత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు మరింత దిగజారిపోయాడు. ఆ అలవాట్లను ఎంత మానుకుందామనుకున్నా అతడి వల్ల కాలేదు. దీంతో నిరాశకు లోనై ఇంట్లొ ఎవరూ లేని సమయంలొ ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. తన లాగా మత్తుకు ఎవ్వరూ బానిసలు కావద్దని బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని.. యువతకి సందేశం ఇస్తూ సాయి తన చివరి మాటలని సూసైడ్ లెటర్‌లో రాశాడు. సాయి రాసిన చివరి మాటలని అతడి స్నేహితులు ఫ్లెక్సీ రూపంలో గ్రామంలో ఏర్పాటు చెశారు. ఆ ఫ్లెక్సీ గ్రామంలో చర్చనీయాంశం గా మారింది. అందర్నీ ఆలోచింజేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..