Vakeel Saab: అందుకే పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని ఒప్పుకున్నారట.. సేనాని మనసులో మాట

|

Jan 12, 2021 | 6:02 PM

అర్థరాత్రి కూడా ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలి.. ఇదీ వకీల్‌సాబ్‌ మూవీకి సెంట్రల్‌ థీమ్. పక్కా కమర్షియల్ హీరో పవన్‌కల్యాణ్‌ ఇటువంటి థీమ్‌ని ఎలా పిక్ చేసుకున్నారు. పైగా.. రీఎంట్రీ కోసం..?

Vakeel Saab: అందుకే పవర్ స్టార్ వకీల్ సాబ్ చిత్రాన్ని ఒప్పుకున్నారట.. సేనాని మనసులో మాట
Follow us on

అర్థరాత్రి కూడా ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలి.. ఇదీ వకీల్‌సాబ్‌ మూవీకి సెంట్రల్‌ థీమ్. పక్కా కమర్షియల్ హీరో పవన్‌కల్యాణ్‌ ఇటువంటి థీమ్‌ని ఎలా పిక్ చేసుకున్నారు. పైగా.. రీఎంట్రీ కోసం..? ఇదే కదా మీ డౌట్. పవర్‌స్టార్ దగ్గరైతే దీనికి కరెక్ట్ ఆన్సరుంది. ఆడపిల్లలు-ఆత్మాభిమానం.. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఈ విషయం తనకు చిన్నప్పుడే తెలిసొచ్చింది అని ఓపెన్ డయాస్ మీదే చెప్పారు పవన్‌. ఈ సమస్యకు ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందన్నది ఆయన ఆశ.

ఎక్కడో ఎందుకు? కొన్నిసార్లు తాను షూటింగ్‌ చేస్తున్న ప్రదేశాల్లోనూ మహిళలపై అఘాయిత్యాలు జరిగేవట. వాటిని చూసీ చూడకుండా ఉన్న రోజులు కొన్నయితే, పట్టరాని కోపంతో అవతలివారిపై చేయి చేసుకున్న ఘటనలు కూడా లేకపోలేదన్నది పవన్‌ మాట. వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ని వకీల్‌సాబ్‌లో చూపించారట మేకర్స్. అందుకే కథ వినీ వినగానే కనెక్ట్ అయిందట పవర్‌ స్టార్‌కి. దటీజ్‌ వకీల్‌సాబ్‌ కా కహానీ.

Also Read:

Viral News: ఎంత క్రియేటివిటీ..ఎంత క్రియేటివిటీ.. ఖాకీలే కంగుతిన్నారు.. ఎలుక కన్నాల మాటున

AP SEC vs AP Government: ఎన్నికల కమిషన్ సెక్రటరీ పోస్ట్ నుంచి వాణీమోహన్‌ను తొలగిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు

Family Suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం.. ఏడాదిన్నర బాలుడు సహా దంపతులు బలవన్మరణం