Telangana: రూ. 51 కొట్టు.. మేకను పట్టు.. రెండు ఫుల్ బాటిల్స్, రెండు కడకనాథ్ కోళ్ళు, కాటన్ బీర్లు ఫ్రీ!

| Edited By: Balaraju Goud

Sep 29, 2024 | 11:35 AM

దసరా పండగ సమీపిస్తుండటంతో అప్పుడే గ్రామాల్లో సందడి మొదలైంది. దసరా పండుగకు పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ వస్తువులపై ఆఫర్లు ప్రకటించడం సర్వసాధారణమే. కానీ ఈసారి గ్రామాలలో బంపర్ ఆఫర్లు నడుస్తున్నాయి

Telangana: రూ. 51 కొట్టు.. మేకను పట్టు.. రెండు ఫుల్ బాటిల్స్, రెండు కడకనాథ్ కోళ్ళు, కాటన్ బీర్లు ఫ్రీ!
Dasera Offers
Follow us on

దసరా పండగ సమీపిస్తుండటంతో అప్పుడే గ్రామాల్లో సందడి మొదలైంది. దసరా పండుగకు పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ వస్తువులపై ఆఫర్లు ప్రకటించడం సర్వసాధారణమే. కానీ ఈసారి గ్రామాలలో బంపర్ ఆఫర్లు నడుస్తున్నాయి. 51 రూపాయలు కొట్టు.. మేకను పట్టు, రెండు ఫుల్ బాటిల్స్, రెండు కడకనాథ్ నాటు కోళ్ళు, కాటన్ బీర్లు అంటూ సోషల్ మీడియాలో వెరైటీ ప్రచారం సాగుతోంది.

తెలంగాణలో దసరా పండుగను చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. కొత్త బట్టలు సుక్క.. ముక్క లేనిదే నడవదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో లక్కీ డ్రా పేరుతో విచిత్రమైన దసరా ఆఫర్లు కొనసాగుతున్నాయి. చిట్యాల, మర్రిగూడ, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో సోషల్ మీడియాలో దసరా ఆఫర్లు సందడి చేస్తున్నాయి. గ్రామాల్లో కొందరు యువకులు 51 రూపాయలు కొట్టు.. మేకను పట్టుకో అని ప్రచారం చేస్తున్నారు. ఈ స్కీంలో 51 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే.. కూపన్ల నుంచి డ్రా తీస్తారు. మొదటి బహుమతిగా పన్నెండు కిలోల మేక, రెండో బహుమతిగా రెండు లిక్కర్ బాటిళ్లు, మూడో బహుమతిగా మరో రెండు లిక్కర్ బాటిళ్లు, నాలుగో బహుమతిగా రెండు కడక్నాథ్ నాటు కోళ్లు, ఐదో బహుమతిగా కాటన్ బీర్లు ఇచ్చేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో వంద రూపాయలు కొట్టు.. మేకను పట్టు అంటూ సరికొత్త స్కీం ప్రారంభించారు.

మొత్తంగా నల్గొండ జిల్లాలో దుమ్మురేపుతున్న ఈ ఆఫర్ రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది. మాయ లేదు మోసం లేదు.. పూర్తిగా లక్ అంటూ..లక్కీ డ్రా లో మీరే గెలుచు కుంటారు అంటూ పెద్ద ఎత్తున గ్రామాలలో దసరా ఆఫర్లు కొనసాగుతున్నాయి. అయితే 50 రూపాయలు, 100 రూపాయలేగా పోతే పోయేది.. వస్తే మాత్రం అంతకు మించిన విలువైనవి వస్తాయి.. అదృష్టం బాగుంటే మేకనే మన సొంతం అవుతుందని చాలా మంది దసరా సందర్భంగా అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ఈ దసరా ప్రచారాలపై దసరా పండుగను కూడా సొమ్ము చేసుకుంటున్న సదరు లక్కీ డ్రా ల నిర్వాహకుల పైన పోలీసులు దృష్టి సారించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..