CM KCR: కాసేపట్లో జనగామ జిల్లాకు సీఎం కేసీఆర్.. ‘తగ్గేదేలే ఇది కేసీఆర్ అడ్డా’ అంటూ ఫ్లెక్సీలు

|

Feb 11, 2022 | 9:12 AM

Telangana News: జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని సీఎం ఇవాళ ప్రారభించనున్నారు. ఇప్పటికే పట్టణమంతా గులాబీమయం అయ్యింది.

CM KCR: కాసేపట్లో జనగామ జిల్లాకు సీఎం కేసీఆర్.. తగ్గేదేలే ఇది కేసీఆర్ అడ్డా అంటూ ఫ్లెక్సీలు
Cm Kcr
Follow us on

cm kcr Jangaon district tour: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన షురూ అయ్యింది. కాసేపట్లో జనగామ జిల్లాకు చేరుకోనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం పదకొండున్నరకు హెలికాప్టర్‌లో జనగామకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. ముందుగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించనున్నారు కేసీఆర్. అధికారులతో సమీక్ష అనంతరం భోజనం చేసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు గులాబీ బాస్. జనగామ జిల్లా మోడల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ఇక్కడే పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు కేసీఆర్. సీఎం సభకు భారీ ఏర్పాట్లు చేశారు నేతలు. జనగామ పట్టణాన్ని గులాబీ జెండాలతో అలంకరించారు. తగ్గేదేలే, ఇది కేసీఆర్ అడ్డా, అని భారీ బెలూన్ సహాయంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇవాళ్టి సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఆసక్తి నెలకొంది. . సుమారు లక్షా 30 వేల మంది సభకు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ పార్లమెంటులో విభజనపై మాట్లాడటం, ఆ తర్వాత టీఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేయడంతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. అటు మోదీ కామెంట్స్‌పై ఫైర్‌ అయ్యారు టీఆర్ఎస్ నేతలు. కానీ కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదు. జనగామ సభలోనే ప్రధాని మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో స్పందించే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. సభలో సీఎం ఏ విధంగా స్పందిస్తారోననే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. మొత్తంగా కేసీఆర్ టూర్ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది.

 

Also Read: Andhra Pradesh: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్