Covid-19: వరంగల్ నిట్‌లో కరోనా కలకలం.. 11 మంది విద్యార్థులకు పాజిటివ్..

|

Jan 07, 2022 | 8:03 AM

Warangal NIT: వరంగల్‌ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌) లో ఐదుగురికి కరోనా కలకలం రేపింది. నిట్‌లో చదువుతున్న 11 మంది విద్యార్థులకు

Covid-19: వరంగల్ నిట్‌లో కరోనా కలకలం.. 11 మంది విద్యార్థులకు పాజిటివ్..
Nit Warangal
Follow us on

Warangal NIT: వరంగల్‌ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌) లో ఐదుగురికి కరోనా కలకలం రేపింది. నిట్‌లో చదువుతున్న 11 మంది విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నిట్ అధికారులు అప్రమత్తమయ్యారు. క్యాంపస్‌లోని పలువురు విద్యార్థులకు కరోనా సోకిన నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో విద్యార్థులంతా హుటాహుటిన ఇళ్లకు బయల్దేరి వెళ్లారు. కాగా.. ఇటీవల క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు అధికారులు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సిబ్బంది ఒకరికి పాజిటివ్‌ రాగా.. మరో 10 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

క్లాసులు బంద్..
నిట్‌లో కరోనా కేసులు వెలుగుచూడడంతో తరగతులను నిలిపివేశారు. ప్రైమరీ కాంటాక్టు అయిన వారందరూ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ నెల 16 వరకు పలు తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేయనున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ ఆచార్య ఎన్‌వీ.రమణారావు తెలిపారు. మిగతా ఉద్యోగులందరికీ కూడా పరీక్షలు నిర్వమించనున్నట్లు తెలిపారు.

Also Read:

Kerala High Court: చెప్పేందుకు చాలా ధైర్యం కావాలి.. లైంగిక వేధింపులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

Jobs Recruitment: కరోనా ఆంక్షలు విధించకపోతే నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు..!