ఇదో కొత్త తరహా దోపిడీ.. దీక్షధారులుగా వచ్చి మహిళలను మత్తులోకి దించి దారుణం..!

వరంగల్ నగరంలో కొత్త తరహా దోపిడీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. స్వామి దీక్షలో ఉన్నట్లు నటిస్తూ ఇళ్లలోకి ప్రవేశిస్తున్న దుండగులు మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. పట్టీలకు మెరుగు పెడతామని నమ్మించి, మత్తు మందు ఇచ్చి మహిళల ఒంటిపై ఉన్న వెండి ఆభరణాలను అపహరిస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వరంగల్‌లోని కరీమాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదో కొత్త తరహా దోపిడీ.. దీక్షధారులుగా వచ్చి మహిళలను మత్తులోకి దించి దారుణం..!
Steal Silver Ornaments

Edited By:

Updated on: Nov 14, 2026 | 10:08 AM

వరంగల్ నగరంలో కొత్త తరహా దోపిడీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. స్వామి దీక్షలో ఉన్నట్లు నటిస్తూ ఇళ్లలోకి ప్రవేశిస్తున్న దుండగులు మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. పట్టీలకు మెరుగు పెడతామని నమ్మించి, మత్తు మందు ఇచ్చి మహిళల ఒంటిపై ఉన్న వెండి ఆభరణాలను అపహరిస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వరంగల్‌లోని కరీమాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. కరీమాబాద్‌కు చెందిన నీలం రత్నావతి (36), ఇంటర్ విద్యార్థిని నీలం శిల్పారాణి ఇంట్లో ఉన్న సమయంలో మాల ధరించిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. తాము స్వామి దీక్షలో ఉన్నట్లు నమ్మిస్తూ, వారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలకు మెరుగు పెడతామని చెప్పారు. వారి మాటలు నమ్మిన మహిళలు ఆ ఇద్దరినీ ఇంట్లోకి అనుమతించారు.

అనంతరం దుండగులు నీళ్ల రూపంలో ఉన్న మత్తు ద్రావణాన్ని మహిళలకు తాగించారు. అది తాగిన కొద్దిసేపటికే రత్నావతి, శిల్పారాణి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇదే అదనుగా భావించిన దుండగులు వారి కాళ్లకు ఉన్న సుమారు 10 తులాల వెండి పట్టీలు, 3 తులాల మట్టెలను అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. కొంతసేపటి తర్వాత మత్తు నుంచి తేరుకున్న బాధిత మహిళలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీఎస్ పోలీసులు, ఫింగర్ ప్రింట్ నిపుణులు కూడా రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దీక్ష పేరుతో అమాయకులను నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్న ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మిల్స్ కాలనీ పోలీసులు వెల్లడించారు.

వీడియో ఇక్కడ చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us