G Kishan Reddy: పెద్ద నాయకుడిగా సీఎం కేసీఆర్ ఊహించుకుంటున్నారు.. మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

|

Jun 11, 2022 | 5:09 PM

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి(Union Miniset G Kishan Reddy) అన్నారు. బీజేపీపై కేసీఆర్ నుంచి పొగత్తలను ఎవరూ ఆశించడం లేదన్న కిసన్ రెడ్డి..

G Kishan Reddy: పెద్ద నాయకుడిగా సీఎం కేసీఆర్ ఊహించుకుంటున్నారు.. మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Union Minister G Kishan Reddy (File Photo)
Follow us on

Telangana BJP vs TRS: జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తి చూపిస్తుండటంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి హస్తిన రాజకీయాలు వేడెక్కాయి.  తెలంగాణలో బీజేపీ – టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister G Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే బీజేపీ పార్టీ భయపడదన్నారు. తమకు టీఆర్‌ఎస్ మద్ధతుతో పనిలేదనీ.. దేశ ప్రజల మద్ధతు ఉంటే చాలన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తానే పెద్ద నాయకుడిగా కేసీఆర్ ఊహించుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ సరిపోవటం లేదని.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని పంచుకోవాలని అనుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. అయితే ఫాంహౌస్‌లో కూర్చుని కేసీఆర్ కంటోన్న కలలు కల్లలుగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీపై కేసీఆర్ నుంచి పొగత్తలను ఎవరూ ఆశించడం లేదన్న కిసన్ రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. కుటుంబ పార్టీలకు అండగా ఉంటారా? దేశాన్ని కాపాడే పార్టీకి అండగా ఉంటారా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

ఏపీలో ట్రైబల్ బ్యూజియం పనులు మొదలయ్యాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కనీసం స్థలం కూడా కేటాయించలేదని ఆరోపించారు. జులై 4న ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించే అవకాశముందని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..