Telangana Rain: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు : హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

|

Apr 10, 2021 | 6:41 AM

Telangana Rain: తెలంగాణ రాష్ట్రంలో చెడగొట్టు వానలు కురుస్తున్నాయి. పంటలు చేతికందే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం..

Telangana Rain: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు : హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
Follow us on

Telangana Rain: తెలంగాణ రాష్ట్రంలో చెడగొట్టు వానలు కురుస్తున్నాయి. పంటలు చేతికందే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత భారీగా ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు వికారాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో 24.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

మరోవైపు ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ 40.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి, విదర్భ నుంచి తెలంగాణ ఇంటీరియల్‌ కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియల్‌ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవీ చదవండి: Petrol and Diesel Price : స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్ ధరలు.. వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి..

New Covid Centers : హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు కొవిడ్ కేర్‌ కేంద్రాల ఏర్పాటు.. ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం