Telangana: సామాన్యులకు షాకింగ్ న్యూస్… ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం !

|

Nov 06, 2021 | 6:46 PM

సామాన్యులకు కాస్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు దూసుకుపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ఉన్నోడికే అందుతామ్ అన్నట్లు దూసుకుపోతున్నాయి.

Telangana: సామాన్యులకు షాకింగ్ న్యూస్... ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం !
Tsrtc
Follow us on

సామాన్యులకు కాస్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు దూసుకుపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ఉన్నోడికే అందుతామ్ అన్నట్లు దూసుకుపోతున్నాయి. వంట గ్యాస్ వాయించేస్తోంది. ఆఖరికి కూరగాయలు కూడా కన్నీరు పెడుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రజలపై మరో భారం పడనుంది. బస్‌ ఛార్జీలు పెరగబోతున్నాయి. త్వరలోనే దీనిపై కేబినెట్‌లో నిర్ణయం జరగబోతోంది. కిలోమీటరుకు 15 పైసల నుంచి 30 పైసలు పెంచాలనే ఆలోచన చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. పెరిగిన డీజిల్‌ భారం నుంచి బయట పడాలంటే చార్జీలు స్వల్పం పెంచాలని భావిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. చార్జీల పెంపు ద్వారా ప్రయాణికులపై వెయ్యి కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చేందుకు చాలా ఇబ్బందులు పడుతోంది. కరోనా కష్టాలు కూడా తోడయ్యాయి.

ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారులు నేరుగా సీఎంకు పరిస్థితిని వివరించారు. వచ్చే కేబినెట్ మీటింగ్‌లోగా ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో..అధికారులు ఏ మేర పెంచితే..ఎంత మేర నష్టం భర్తీ అవుతుందనే అంశం పైన సీఎంఓకు రిపోర్ట్ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లోనే సీఎం దీనిపైన ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఛార్జీల పెంపు తప్పనిసరి అని తెలుస్తోంది. వచ్చేవారంలో ధరల పోటు ఉంటుందని సమాచారం.

Also Read:  ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్.. అతి చేస్తే ఇంతే.. పూర్తి వివరాలు

తాగి ఇంకొకరి ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. రక్తం వచ్చేలా కొట్టిన యజమాని