
హైదరాబాద్‌లో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో కారు నడుపుతూ మరో కారును ఢీకొట్టాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ వ్యవహరించిన తీరు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ డ్రైవర్ అర్థంకాని భాషలో మాట్లాడుతూ నానా హంగామా చేశాడు. ఎంత చెప్పినా వినకుండా రోడ్డుపైనే రచ్చ చేయడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి. పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అనంతరం అతని కారును తనిఖీ చేయగా అందులో 6 మద్యం బాటిళ్లు కూడా కనిపించాయి. దీంతో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకొని అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మద్యం తాగి వాహనం నడపడం వల్ల తన ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టినట్లవుతుంది. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా వాహనదారుల్లో మాత్రం రావడం లేదు. అత్తాపూర్‌లో జరిగిన ఈ ఘటన మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై చర్చకు దారితీసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.