Hyderabad: నగరంలో రోజురోజుకు పెరుగుతున్న అలాంటి కేసులు.. కేవలం 5 నెలల్లో ఎన్నంటే..

నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు వాహనదారులు. వివిధ కారణాల చేత పట్టుబడిన వాహనదారులు ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నా తమకేంటిలే అన్న ధీమాని వ్యక్తం చేస్తూ.. వాహనదారులు ప్రయాణిస్తున్నారు. అడుగడుగునా ట్రాఫిక్ చెకింగ్ పాయింట్స్ ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. రూల్స్‎ను అతిక్రమిస్తూ ప్రయాణం చేస్తున్నారు.

Hyderabad: నగరంలో రోజురోజుకు పెరుగుతున్న అలాంటి కేసులు.. కేవలం 5 నెలల్లో ఎన్నంటే..
Hyderabad
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 17, 2024 | 5:05 PM

నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు వాహనదారులు. వివిధ కారణాల చేత పట్టుబడిన వాహనదారులు ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నా తమకేంటిలే అన్న ధీమాని వ్యక్తం చేస్తూ.. వాహనదారులు ప్రయాణిస్తున్నారు. అడుగడుగునా ట్రాఫిక్ చెకింగ్ పాయింట్స్ ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. రూల్స్‎ను అతిక్రమిస్తూ ప్రయాణం చేస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నగరంలో పెరిగిపోవడంతో.. ఐదు నెలల్లోనే 18 లక్షలకు పైగా కేసులను నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు.

హెల్మెట్ ధరించరు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు సీసీ కెమెరాలు ఉన్నా వాటి కళ్ళు కప్పి నెంబర్ ప్లేట్లను సైతం కనపడుండకుండా మాస్కులతో.. చున్నీలతో కవర్ చేస్తారు. ఎన్ని సమావేశాలు, సదస్సులు నిర్వహించినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు వాహనదారులు. ఈ ఏడాది వ్యవధిలోని ఏకంగా 18 లక్షలకు పైగా కేసులను నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. నగరంలో చాలా ప్రాంతాల్లో యూటర్న్లు ఎక్కువగా దూరంగా ఉండడంతో.. రాంగ్ రూట్లోకి వెళ్లి ప్రాణాలను కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మైనర్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు లేకపోవడం, రాంగ్ పార్కింగ్ ఈ విధంగా ఎన్నో కేసులను నమోదు చేస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ ఏమాత్రం చలనం లేకుండా తమ ఇష్టానుసారంగా వెళుతూ ఉన్నారు. వాహనదారులు అయితే 2023లో 9,40, 670 కేసులు హెల్మెట్ లేని వారిపై కేసులను నమోదు చేయగా 2024లో 11,46,698 కేసులను నమోదు చేశారు. ఈ విధంగా 2023లో 14,27,933 కేసులు నమోదు కాగా ఈ ఐదు నెలల్లో 18 లక్షలకు పైగా కేసులను నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. దీనిని బట్టి చూస్తే ఈ రూల్స్‎ను మరింత కఠినతరం చేసి ట్రాఫిక్ ఉల్లంఘనలను అతిక్రమించకుండా చర్యలు తీసుకోవాలి అని కొంతమంది వాహనదారులు తెలియజేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Latest Articles
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!