అర్థరాత్రి వరకు హోటల్‌కు పర్మిషన్.. సీఐకి నెలనెలా ప్యాకేజీ! చివరకు ఏసీబీకి అడ్డంగా బుక్!

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బుధవారం (నవంబర్ 18) రాత్రి 9 గంటల 40 నిమిషాల సమయంలో తన కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటుండగా అధికారులు ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు.

అర్థరాత్రి వరకు హోటల్‌కు పర్మిషన్.. సీఐకి నెలనెలా ప్యాకేజీ! చివరకు ఏసీబీకి అడ్డంగా బుక్!
Tolichowki Police Inspector

Updated on: Nov 19, 2026 | 7:56 AM

 

రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టోలిచౌకి సీఐ!

 

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బుధవారం (నవంబర్ 18) రాత్రి 9 గంటల 40 నిమిషాల సమయంలో తన కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటుండగా అధికారులు ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. టోలిచౌకి పరిధిలోని ఓ హోటల్ నిర్వాహకుడిని అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా హోటల్ నడిపేందుకు అనుమతిస్తానని చెప్పి సీఐ నెలకు రూ.50 వేల చొప్పున మామూళ్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే అక్టోబర్ 31న రూ.20 వేలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తాజాగా మరో రూ.20 వేలు తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు.

ఈ దాడిలో సీఐ క్యాబిన్‌లోని బ్యాగులో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రూ.1 లక్ష, రూ.50 వేలు, రూ.20 వేలు, రూ.15 వేల నగదు ఉన్న నాలుగు కవర్లను కూడా గుర్తించారు. ఈ మొత్తాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరికి సంబంధించినవి? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. సీఐ రమేష్ నాయక్ అవినీతి వ్యవహారంపై ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీస్ శాఖలో లంచం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us