నల్లమలలో ఉత్కంఠభరిత దృశ్యం.. గర్జిస్తూ వెంటాడిన పులి.. భయంతో పరుగులు తీసిన ఎలుగుబంటి!

నల్లమల అడవిలో వన్యప్రాణుల మధ్య చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన పర్యాటకులను ఉత్కంఠకు గురిచేసింది. అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న పెద్దపులి.. ఓ ఎలుగుబంటిని వెంటాడటంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. సాధారణంగా అడవిలో వన్యప్రాణులను చూసేందుకు వెళ్లే పర్యాటకులకు ఈసారి అనూహ్యమైన దృశ్యం కనిపించింది.

నల్లమలలో ఉత్కంఠభరిత దృశ్యం.. గర్జిస్తూ వెంటాడిన పులి.. భయంతో పరుగులు తీసిన ఎలుగుబంటి!
Tiger Chases Bear During Safari

Edited By:

Updated on: Nov 10, 2026 | 2:02 PM

నల్లమల అడవిలో వన్యప్రాణుల మధ్య చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన పర్యాటకులను ఉత్కంఠకు గురిచేసింది. అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న పెద్దపులి.. ఓ ఎలుగుబంటిని వెంటాడటంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. సాధారణంగా అడవిలో వన్యప్రాణులను చూసేందుకు వెళ్లే పర్యాటకులకు ఈసారి అనూహ్యమైన దృశ్యం కనిపించింది.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సఫారీ కోసం అడవిలోకి వెళ్లిన పర్యాటకులకు పెద్దపులి, ఎలుగుబంటి ఎదురుపడ్డాయి. ఈ క్రమంలో పెద్దపులి ఎలుగుబంటిని వెంటాడింది. రెండు వన్యప్రాణుల కదలికలతో సఫారీ వాహనాల్లో ఉన్న పర్యాటకులు ఆసక్తిగా ఆ దృశ్యాలను తిలకించారు. పెద్దపులి వెంటపడుతున్న సమయంలో ఎలుగుబంటి అరుస్తూ పరుగులు తీయడం.. పులి గర్జనలతో అడవి మార్మోగడం పర్యాటకులను మరింత ఉత్కంఠకు గురిచేసింది.

సాధారణంగా వేర్వేరుగా కనిపించే ఈ రెండు వన్యప్రాణులు ఒకే చోట ఇలా ఎదురుపడటంతో పర్యాటకులకు అరుదైన అనుభవం ఎదురైంది. ఈ ఆసక్తికర దృశ్యాలను కొందరు పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. పెద్దపులి ఎలుగుబంటిని వెంటాడుతున్న దృశ్యాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణ సఫారీ ప్రయాణం కాస్తా… జీవితంలో మరిచిపోలేని అనుభవంగా మారింది.

నల్లమల అటవీ అందాలతో పాటు అక్కడి వన్యప్రాణుల జీవనశైలి ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us