Telangana News: వీడు భర్త కాదు, రాక్షసుడు.. భార్యను అడవిలో వదిలి వెళ్ళాడు..చివరికు?

| Edited By: Velpula Bharath Rao

Dec 15, 2024 | 1:08 PM

సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి గ్రామ శివారులో అడవిలో ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. అసలు ఏం జరిగింది? ఆ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది?

Telangana News: వీడు భర్త కాదు, రాక్షసుడు.. భార్యను అడవిలో వదిలి వెళ్ళాడు..చివరికు?
The Husband Left His Wife In The Forest In Vantimamidi Village In Medak
Follow us on

భార్య భర్తల మధ్య గొడవలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అవి ఎక్కిడికి దారి తీస్తున్నాయో కూడా అర్ధంకానీ పరిస్థితి కొందరిది. ఇలా దంపతుల మధ్య రోజూ ఏదో ఒక విషయంలో గొడవలు తలెత్తడం, కాసేపటికి సర్దుకుపోవడం సర్వ సాధారణం. కానీ కొన్నిసార్లు మాత్రం ఈ గొడవలు తారాస్థాయికి చేరుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. మరి కొంతమంది అయితే హత్యలు, ఆత్మహత్యలకు సైతం వెనుకడడం లేదు. ఇలాగే తన భార్యతో గొడవలు పెట్టుకున్న ఓ భర్త ఆమెను అడవిలో వదిలిపెట్టి వెళ్ళాడు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి గ్రామ శివారులో అడవిలో ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది.

దీన్ని గమనించిన స్థానికులు పోలిసులకు సమాచారం ఇవ్వడంతో, అసలు విషయాలు బయటకు వచ్చాయి. ములుగు ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్ తల్లిదండ్రులు హైదరాబాద్ అల్వాల్‌లో ఉంటారు. కాగా విక్రమ్ మన్వర్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. అక్కడే విక్రమ్‌కి, రబియా అనే యువతి పరిచయం అయ్యింది. కాగా వీరు ఈ ఏడాది జనవరి నుంచి కలిసి ఉంటున్నారు. కాగా ఈనెల 4న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి.

అయితే హైదరాబాద్ వచ్చాక శనివారం మళ్లీ గొడవ జరగడంతో రబియా పెయిన్ కిల్లర్ మాత్రలు మింగింది. దీంతో విక్రమ్ మన్వర్ ఆమెను తీసుకొచ్చి ములుగు మండలం వంటిమామిడి సమీపంలో ఉన్న అడవిలో వదిలి వెళ్లాడు. రోడ్డు పక్కన పండ్లు అమ్ముకునే వ్యాపారులు ఈ విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, స్పృహ తప్పి పడిపోయి ఉన్న రబియాను చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లిలో ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న రబియా ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి