Telangana – Trs Politics: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్టుల మీద ట్విస్టులు.. కవితకు ఎమ్మెల్సీ నా? ఎంపీ నా?..

|

Nov 17, 2021 | 5:50 PM

NZB MLC Suspense: రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో జరిగిన ట్విస్ట్ లు ఇప్పుడు నిజామాబాద్ రాజ‌కీయాల‌ను వేడేక్కిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఇప్పటి వ‌ర‌కు ఉన్న ఆకుల..

Telangana - Trs Politics: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్టుల మీద ట్విస్టులు.. కవితకు ఎమ్మెల్సీ నా? ఎంపీ నా?..
Follow us on

NZB MLC Suspense: రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో జరిగిన ట్విస్ట్ లు ఇప్పుడు నిజామాబాద్ రాజ‌కీయాల‌ను వేడేక్కిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఇప్పటి వ‌ర‌కు ఉన్న ఆకుల లలిత ను ప‌క్కన పెట్టడంతో పాటు బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయ‌డంతో ఇప్పుడు నిజామాబాద్ రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌ర్చ మొద‌ల‌య్యింది. ఇప్పటికే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నిక‌ల నోటిపికేష‌న్ వెలువ‌డ‌టంతో ఇప్పుడు ఆ అభ్యర్థి ఎవ‌రు అనే చ‌ర్చ జిల్లా రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ క‌విత‌ నిజామాబాద్ లోక‌ల్ బాడి నుండి మ‌ళ్లీ పోటీ చేస్తారా..? లేక ఢిల్లీ వేళతారా? అనేది ఇప్పుడు స‌స్పేన్స్ గా మారింది..!

ఎమ్మెల్సీ ఎంపిక ట్విస్ట్ లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో సెగ రేపుతున్నాయి. నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత ఏ నిర్ణయం తీసుకుంటారు, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు హ‌ట్ టాపిక్ గా మారింది. 2019 లోక్ స‌భలో ఎన్నికల్లో ఓట‌మి అనంత‌రం కొంత గ్యాప్ త‌ర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు క‌విత. ఎమ్మెల్సీగా ఎన్నిక‌యిన నాటి నుండి జిల్లా లో చాల యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఎమ్మెల్సీగా ఎన్నిక‌యిన క‌విత అప్పటి నుండి మ‌ళ్లీ జిల్లా రాజ‌కీయాల్లో త‌న మార్క్ ను చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ స్థానిక సంస్థల నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. కానీ ఇంకా అభ్యర్థి ఎవ‌రు అనే డైలామా కంటిన్యూ అవుతుంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇక రాజ్యసభ సీటు కవితకు ఇస్తారనే ప్రచారం నిన్నటి నుండి జోరుగా జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ కవితను పెద్దల సభకు పంపుతారా..? లేదా మ‌ళ్లీ ఇక్కడి నుండే పోటీ చేయిస్తారా అనేది ఇంకా క‌న్‌ఫ్యూజ‌న్ గానే ఉంది క్యాడ‌ర్ లో. ఇక ఇప్పుడు క‌విత నిర్ణయంతోనే ఆశావాహుల భ‌విత‌వ్యం ఆదార‌ప‌డి ఉంది. ఎమ్మెల్యే కోటా, లోక‌ల్ బాడి ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో ఉమ్మడి జిల్లాలో హేమాహేమీలు పోటీపడ్డారు. తాజా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఎమ్మెల్సీ పోస్ట్ రెన్యూవల్ కాకపోవడం జిల్లా నేతల్లో టెన్షన్‌కు కారణమవుతోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ క‌విత‌ను రాజ్యస‌భ‌కు పంపితే లోక‌ల్ బాడి ఎమ్మెల్సీగా ఆకుల లలితకు అవకాశం ఇస్తారనే ప్రచారం జోరందుకుంది.

లోక‌ల్ బాడి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పెండింగ్‌లో ఉండడంతో అధిష్టానం చుట్టూ జిల్లా నేతలు చక్కర్లు కొడుతున్నారు. అయితే, ఈ కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కూతురు కవిత సిట్టింగ్ కావడంతో నాయకులు అవకాశం కోసం సాహసించడం లేదు. అయితే, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ ఖరారు చేయడంతో కవితకు రాజ్యసభ సీటు ఇస్తే.. ఆ స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని ఈపాటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీ అధినేతను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఇక ఆకుల లలిత తో పాటు మాజీ ఎమ్మెల్సీ న‌ర్సారెడ్డి, జిల్లాలోని ప‌లువురు ఆశావాహులు కూడా వ‌ర్కింగ్ ప్రెసిడెండ్ కేటిఆర్ ను క‌లిసి త‌మ ప్రొఫైల్‌ను ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ క‌విత‌ను రాజ్యస‌భ‌కు పంపిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ నిజామాబాద్ స్థానిక సంస్థల నుండే మ‌ళ్లీ పోటి చేస్తార‌నే ప్రచారం కూడ జ‌రుగుతుంది. రాజ్యస‌భ‌కు వేళితే ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూరం అయిన‌ట్లు అవుతుంద‌నే భావ‌నలో కవిత ఉన్నార‌నే ప్రచారం ఉంది. ఎమ్మెల్సీగా ఎన్నిక‌యిన‌ప్పటి నుండి జిల్లాపై, ముఖ్యంగా పార్లమెంట్ సెగ్మెంట్ పై పూర్తి స్థాయిలో గ్రిప్ సాదించారు క‌విత. జిల్లాలోని అంద‌రు ప్రజా ప్రతినిధుల‌తో ట‌చ్‌లో ఉన్నారు. గ్రౌండ్ లెవ‌లో ప్రజ‌ల‌కు ద‌గ్గర‌వ‌డానికి స్కోప్ ఉంటుంద‌నే బావ‌న అటు ఇక్కడి స్థానిక నాయ‌కుల్లోనూ ఉంది. ఇప్పుడు ఢిల్లీకి వేళితే మ‌ళ్లి గ్యాప్ పెరుగుతుంద‌నే ఆందోళ‌న స్థానిక నాయకుల్లో ఉండ‌టంతో ఎమ్మెల్సీ గానే మ‌ళ్లీ బ‌రిలో ఉండాల‌ని నాయ‌కులు కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుండి జిల్లాపై స్పేష‌ల్ పోక‌స్ చేశారు క‌విత. కోవిడ్ టైమ్‌లో కాల్ సెంట‌ర్ ఏర్పాటుతో పాటుగా, జిల్లా అస్పత్రిని యువికేన్ పౌండేష‌న్ సౌజ‌న్యంతో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. దీంతో అటు నాయ‌కులకు, ఇటు ప్రజ‌ల‌కు క‌విత ఎమ్మెల్సీగానే వ‌స్తార‌నే న‌మ్మకంతో ఉన్నారు.

మొత్తానికి వ‌రుస ట్వీస్ట్ లతో సాగుతున్న ఈ ఏపిసోడ్, ఇప్పుడు నిజామాబాద్ లోక‌ల్ బాడి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యంలో ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి, ఎమ్మెల్సి క‌విత మ‌ళ్లి ఢిల్లీ బాట ప‌డుతారా..? లేదా లోక‌ల్ బాడితో లోక‌ల్‌గా ఉంటారా? అనేది వేచి చూడాలి.!

Also read:

Viral Video: మొసలికి కోపమొస్తే ఇంతేనేమో.! తనతో గేమ్ ఆడాలనుకున్న వ్యక్తిని చెడుగుడు ఆడుకుంది.!

Telangana – Trs vs Bjp: ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్.. లేఖలో ఏం డిమాండ్ చేశారంటే..!

UP Elections 2022: యూపీలో సమాజ్‌వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. నలుగురు ముఖ్యనేతలు బీజేపీకి జంప్