Telangana: తెలంగాణలో ధాన్యం కష్టాలు! భయాందోళనతో రైతులు

వరి వేస్తే ఉరే. పుష్కరకాలానికి ముందు కేసీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. అప్పట్లో పెద్ద సెన్సేషనే ఐంది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విధానాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో, కొన్ని ప్రత్యేక ప్రతికూల పరిస్థితుల్లో, రైతులు నష్టపోకూడదన్న సదుద్దేశంతో.. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విధాన ప్రకటనే జారీ చేసింది. కానీ, అప్పట్లో విపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకుంది కూడా. తమ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రతీ వడ్ల గింజనూ కొనుగోలు చేస్తుంది అని హామీలూ ఇచ్చింది. కానీ, ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావంతో పంటల సాగు మళ్లీ సంక్షోభంలో పడింది. ఫలితం వరికి మళ్లీ ఉరి. యాసంగిలో వరి వేస్తే వర్రీ తప్పదని ముఖ్యమంత్రి నుంచి మళ్లీ అదే స్టేట్‌మెంట్. కట్‌చేస్తే, ఇప్పుడు వరి మూడోసారి ఉరి కంబమెక్కింది. తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఐదురకాలుగా ఉంది వరి రైతు దీనావస్థ.

Telangana: తెలంగాణలో ధాన్యం కష్టాలు! భయాందోళనతో రైతులు
Telangana Paddy Farmers

Updated on: Nov 11, 2026 | 9:11 PM

తాగడానికే నీళ్లు లేవు, సాగునీళ్లకైతే అసలు ఛాన్సే లేదు. ప్రపంచంలో దేన్నయినా కొనుక్కోవచ్చు. కోట్లు కుమ్మరించినా ఒక్క నీటిచుక్కను తయారుచేసుకోలేం అని.. యాసంగిలో వరి సాగు మానుకోండి మొర్రో అని ముఖ్యమంత్రి అంతటోడే నెత్తీనోరూ బాదుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇస్తున్న డైరెక్షన్‌కు గ్రౌండ్‌లో సిట్యువేషన్‌కీ తేడా ఉంది. ఎందుకంటే, నేల స్వభావాన్ని బట్టి పంటలెయ్యాల్సిన కొన్ని ప్రత్యేక పరిస్థితులుంటాయి. ప్రత్యామ్నాయ పంటలకు అస్సలు సహకరించని భూములూ ఉంటాయి. అక్కడ వరి తప్ప వేరే పంటకు దిక్కుండదు. పైగా, కొద్దోగొప్పో వరి పండించకపోతే తిండిగింజలైనా దొరకని పరిస్థితి కొందరు రైతులది. అందుకే, నీటి లభ్యతను బట్టి కొన్నిచోట్ల మొండిగానే వరినాట్లు పడ్డాయి. అలా పండిన ధాన్యాన్ని కూడా అమ్ముకునే దారి లేక లబోదిబోమంటున్నాడు వరి రైతు. ఎల్‌నినో సీజన్‌లో ఇదోరకం విచిత్రమైన పరిస్థితి. ఎందుకిలా? ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవక.. రోడ్డుపైనే ఎండి అనాధలుగా మారిన వడ్ల గింజలు… అకాలవానకు తడిసి ముద్దయి.. అమ్మకానికి కొరగాక.. ఈ ధాన్యానిది ఇంకో రకం దైన్యం… సిండికేట్‌గా మారి గిట్టుబాటు ధరను కుంగదీస్తున్న రైస్ మిల్లర్లు… నిజామాబాద్ జిల్లాలో మరో రకం దందా. పండిస్తే ఒక తంటా, పండించకపోతే ఇంకో తంటా.. తెలంగాణలో వరి పంటకు ఉరేసినట్టే ఉంది. చావాలేక...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి