Telangana: మెట్రో మార్గాలు విస్తరించడం శుభ పరిణామం.. కేటీఆర్ ప్రకటనపై మంత్రులు హర్షం..

|

Dec 06, 2022 | 5:32 PM

ఈ నెల 9 వ తేదీన రాజేంద్రనగర్ లోని పోలీస్ గ్రౌండ్ లో జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి పరిశీలించారు. రెండో దశ మెట్రో రైలు...

Telangana: మెట్రో మార్గాలు విస్తరించడం శుభ పరిణామం.. కేటీఆర్ ప్రకటనపై మంత్రులు హర్షం..
Minister Talasani Srinivas
Follow us on

ఈ నెల 9 వ తేదీన రాజేంద్రనగర్ లోని పోలీస్ గ్రౌండ్ లో జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి పరిశీలించారు. రెండో దశ మెట్రో రైలు లైన్ గొప్ప ప్రాజెక్టు అని కొనియాడారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు లైన్ నిర్మాణం చేపట్టడం శుభ పరిణామం అని అన్నారు. ఇప్పటికే 93 కిలోమీటర్ల మేర మొదటి దశలో మెట్రో రైలు సేవలు అందుతున్నాయన్న మంత్రులు.. మైండ్ స్పేస్ జంక్షన్ లో ముఖ్యమంత్రి రెండో దశ పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. అనంతరం రాజేంద్ర నగర్ పోలీస్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. కాగా.. హైదరాబాద్ పరిధిలో మెట్రో కారిడార్ పొడిగింపుపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత హయత్‌నగర్‌ వరకు మెట్రో కారిడార్‌ను పొడిగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. నాగోల్‌ – ఎల్బీ నగర్‌ మధ్య మెట్రో అనుసంధానిస్తామన్నారు.

అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది టీఆర్ఎస్సే అని కేటీఆర్ అన్నారు. మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, చిత్తశుద్ధితో డెవలప్‌మెంట్ సాధ్యం అయ్యిందన్నారు. 240 కోట్ల మొక్కలతో రాష్ట్రమంతా హరితహారం కార్యక్రమం చేపట్టామన్నారు. వర్షా కాలం నాటికి మొదటి దశ నాలా పనులు మొత్తం పూర్తి చేసి ముంపు సమస్య తొలగిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌తో పాటు.. మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు.

విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మహా నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులు గమనించిన అధికారులు.. మెట్రో వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే మొదటి దశలో మూడు ప్రధాన మార్గాల్లో మెట్రో సేవలు అందిస్తుండగా రెండో దశలో మెట్రోను విమానాశ్రయం వరకు విస్తరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..