Minister KTR: పేదలకు అందుబాటులోకి వచ్చిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. ఖైరతాబాద్‌లో లబ్ధిదారులకు ఇళ్ళను అందజేసిన మంత్రి కేటిఆర్

|

Feb 03, 2022 | 8:26 PM

Minister KTR: తెలంగాణా(Telangana)లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు(Double Bed Room House)పట్టాలెక్కుతున్నాయి. కంప్లీట్‌ అయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తోంది సర్కార్‌. ఖైరతాబాద్‌లో 210 ఇళ్లను..

Minister KTR: పేదలకు అందుబాటులోకి వచ్చిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. ఖైరతాబాద్‌లో లబ్ధిదారులకు ఇళ్ళను అందజేసిన మంత్రి కేటిఆర్
Minister Ktr Inaugurated Double Bedroom Houses
Follow us on

Minister KTR: తెలంగాణా(Telangana)లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు(Double Bedroom Houses)పట్టాలెక్కుతున్నాయి. కంప్లీట్‌ అయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తోంది సర్కార్‌. ఖైరతాబాద్‌లో 210 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు మంత్రి కేటీఆర్‌. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఖైరతాబాద్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌ మహా నగరంలో9 వేల 714 కోట్ల రూపాయల వ్యయంతో ఇళ్లను నిర్మించామన్నారు మంత్రి కేటీఆర్‌.పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించి..పేదలు ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఉచితంగా 50 లక్షల విలువజేసే ఇంటిని అప్పగిస్తున్నామన్నారు.

కొల్లూరులో ఒకేచోట 15,640 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించామని తెలిపారు. వారం రోజుల్లో కొల్లూరులోని ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల కోట్లతో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్వహణ బాధ్యత లబ్ధిదారులదేనని చెప్పారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఫంక్షన్‌ హాల్‌ కోసం 100 కోట్ల విలువచేసే స్థలం కేటాయించామన్నారు.

ఇందిరానగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లను ఐదంతస్తుల్లో 5 బ్లాక్‌ల్లో నిర్మించారు. సీసీ రోడ్డు, తాగునీరు, 7 లిఫ్టులు, 7 షాపులు, డ్రైనేజీ కాలువ వంటి అన్ని మౌలిక వసతులను కల్పించారు. ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని మొక్కలునాటి సుందరీకరణ పనులు చేపట్టారు.

Also Read:

చిక్కుల్లో చిన్నమ్మ.. జైల్లో సదుపాయాల కోసం ముడుపులు ఇచ్చారంటూ కేసు నమోదు..