Telangana: ఈ నెల 18నుంచి కంటి వెలుగు రెండో దశ ప్రారంభం.. గిన్నిస్ బుక్ రికార్డ్‌పై కన్నేసిన ప్రభుత్వం

|

Jan 11, 2023 | 7:04 AM

హైదరాబాద్‌లోని 91 అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. మొత్తం 152 శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రులు.

Telangana: ఈ నెల 18నుంచి కంటి వెలుగు రెండో దశ ప్రారంభం.. గిన్నిస్ బుక్ రికార్డ్‌పై కన్నేసిన ప్రభుత్వం
Kanti Velugu 2023
Follow us on

హైదరాబాద్‌లో కంటి వెలుగు సెకండ్‌ ఫేజ్‌పై యాక్షన్‌ ప్లాన్‌ రెడీ అయ్యింది. వంద రోజులపాటు సాగే ప్రోగ్రామ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. గిన్నిస్‌ బుక్‌ రికార్డ్సే టార్గెట్‌గా ముందుకెళ్తోంది. తెలంగాణలో కంటి వెలుగు రెండో దశ ప్రోగ్రామ్‌కు రంగం సిద్ధమైంది. ఈనెల 18నుంచి మొదలై, జూన్‌ 30వరకు ఇది కొనసాగనుంది. కంటి వెలుగు రెండో దశను హైదరాబాద్‌లో సమర్ధంగా నిర్వహించడమే లక్ష్యంగా సమీక్ష జరిగింది. హైదరాబాద్‌లోని 91 అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. మొత్తం 152 శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రులు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో కంటి వెలుగు కార్యక్రమం జరుగుతోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. గతంలో కోటిన్నర మందికి పరీక్షలు చేసి 50లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చినట్టు చెప్పారు.

వంద రోజులపాటు సాగే కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం 250కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు మంత్రి తలసాని. 15వందల టీమ్స్‌, 15వందల వెహికల్స్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రెండోదశ ప్రోగ్రామ్‌తో కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లోకి ఎక్కుతుందన్నారు తలసాని

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..