Heavy Rain: తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. హెచ్చరించిన వాతావరణ శాఖ

|

Aug 06, 2022 | 5:15 AM

Heavy Rain: తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం కాగా, ఇప్పుడు మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

Heavy Rain: తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. హెచ్చరించిన వాతావరణ శాఖ
Follow us on

Heavy Rain: తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం కాగా, ఇప్పుడు మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది ప్రభుత్వం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ కారణంగా రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ప్రాజెక్టుల వద్ద అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు రుతుపవణ ద్రోణి వ్యాపించి ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ అల్పపీడనంగా ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలలో రుతు పవనాలు చురుఉగా కదులుతున్నాయని, దీని కారణంగా తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు తెలిపింది. అల్పపీడనం కారణంగా ఈనెల 9వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, వికారాబాద్‌ మహబూబాబాద్‌, సిద్దిపేట్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి తదితర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 8, 9వ తేదీలలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

కాగా, ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు తీవ్ర బీభత్సా్న్ని సృష్టించాయి. భారీగా వరదలు వచ్చి చేరడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎంతో మందిని పునరావా కేంద్రాలకు తరలించారు అధికారులు. ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఈసారి భారీ వర్షాల కారణంగా ఎంతో మంది తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అల్పపడీనం కారణంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మరింత ఆందోళన నెలకొంది. దీంతో అధికారులు సైతం మరింత అప్రమత్తం అవుతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల హెచ్చరికతో ఆందోళన నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి