Telangana Minister: దేశానికి తిండి పెట్టే మహా వ్యక్తి రైతు.. వారితో పెట్టుకున్నోళ్లు బాగుపడినట్లు చరిత్రలో లేదు: మంత్రి ఈటల రాజేందర్

|

Jan 28, 2021 | 5:42 PM

Telangana Minister: రైతు బాగుంటేనే దేశమైనా.. రాష్ట్రమైనా బాగుంటుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

Telangana Minister: దేశానికి తిండి పెట్టే మహా వ్యక్తి రైతు.. వారితో పెట్టుకున్నోళ్లు బాగుపడినట్లు చరిత్రలో లేదు: మంత్రి ఈటల రాజేందర్
Follow us on

Telangana Minister: రైతు బాగుంటేనే దేశమైనా.. రాష్ట్రమైనా బాగుంటుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రైతుతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడినట్లు చరిత్రలో లేదన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. గురువారం కరీంనగర్‌లో రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ మట్టిబిడ్డను నేను. తెలంగాణ ఒడిలో జీవనం సాగిస్తూ భారత మాత బిడ్డగా కొనసాగుతున్న’ అని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు.

ఈటల ఇంకా ఏమన్నారంటే.. ‘తెలంగాణలో నాడు చుట్టం వస్తేనే బియ్యం తినేవారు.. లేదంటే గట్క తినేవారు. రైతు కృషి వల్లే నేడు ప్రతి రోజూ మనందరం అన్నం తింటున్నాం. దేశానికి తిండి పెట్టే మహా వ్యక్తి రైతు. రైతు ఏనాడూ లాభ నష్టాల కోసం పని చేయడు. ఏడాదంతా కష్టపడితే రైతుకు వచ్చే లాభం రూ.30వేలకు మించదు. అందుకే దేశంలో రెండు వర్గాలను మాత్రమే గుర్తిస్తారు. గౌరవిస్తారు. వారే జై జవాన్.. జైకిసాన్. రైతు బాగుంటేనే దేశమైనా.. రాష్ట్రమైనా బాగుంటుంది. తెలంగాణ ఉద్యమ పుట్టుకే సాగునీటి కోసం. అందుకే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను తీసుకువస్తోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా రైతుకు 24 గంటలు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారా?. ఒక దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. అందుకే గ్రామ సీమల అభివృద్ధికై తమ ప్రభుత్వం నడుం భిగించింది.’

‘సాఫ్ట్‌వేర్ బువ్వ పెట్టదు. పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ సంబంధిత వాటితో కోట్ల ఉద్యోగాలు లభిస్తాయి. అన్నింటిని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్.. వ్యవసాయంపైనే వేల గంటలు, వందల రోజులు సమావేశాలు నిర్వహించారు. రైతుల కోసమే ప్రాజెక్టులు నిర్మించారు. రైతు సంక్షేమం కోసం, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశ్యంతోనే రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. రైతు వేదికలు ప్రశ్నించే వేదికలు కావాలి. రైతులు నిత్య చైతన్యంతో ఉండాలి. రైతు అభివృద్ధి చెందాలి.’ అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Also read:

రైతు చట్టాలకు మేమూ వ్యతిరేకం, తీర్మానాన్ని ఆమోదించిన బెంగాల్ అసెంబ్లీ, బీజేపీ నిరసన

Viral Video: తన కూతురు కోసం ఈ తల్లి ఏం చేసిందో చూడండి… కంటతడి పెట్టిస్తోన్న వీడియో..