Yadadri Temple KCR: నేడు యాదాద్రికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ తేదీని ప్రకటించనున్నారా..?

|

Mar 04, 2021 | 1:34 AM

Yadagiri temple KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఆలయ పునర్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తారు. అలాగే ఆలయ ప్రధాన పనులనన్ని..

Yadadri Temple KCR: నేడు యాదాద్రికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ తేదీని ప్రకటించనున్నారా..?
Follow us on

Yadadri Temple KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఆలయ పునర్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తారు. అలాగే ఆలయ ప్రధాన పనులనన్ని ఇప్పటికే పూర్తి కాగా, మిగతా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వాటిని శరవేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 90 శాతానికిపైగా ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. యాదాద్రి నలువైపులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్‌ బాహ్య ప్రాకారాలు, అల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్ప సౌరభం ఉట్టిపడేలా పనులు కొనసాగుతున్నాయి.  లక్ష్మినరసింహాస్వామి ఆలయం నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయ్యింది. కొండపై పుష్కరిణి కూడా పూర్తిస్థాయిలో తయారైంది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు జరుగుతున్నాయి కొనసాగుతున్నాయి.

ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా దాదాపుగా ఓ తది దశకు చేరుకుంది. 15 కాటేజీలలో ఒకటి మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. కళ్యాణకట్ట కొద్దిరోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే దగ్గర రెండు వేల వాహనాలకు పార్కింగ్ సౌలభ్యం కల్పించామని అధికారులు తెలిపారు. ఇది కూడా మరో 15 రోజుల్లో పూర్తవుతుందని యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు భావిస్తున్నారు.

అయితే ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. జరిగిన పనులు, కొనసాగుతున్న పనులపై ఓ అంచనాకు వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే నిజానికి ఫిబ్రవరిలోనూ యాదాద్రి ఆలయాన్ని పునర్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావించగా, పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో అది వాయిదా పడింది. అయితే క్షేత్రస్థాయిలో పనుల జరుగుతున్న తీరును పరిశీలించిన అనంతరం చినజీయర్ స్వామితో చర్చించిన ఆలయ ప్రారంభ తేదీపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే అన్ని విధాలుగా రూపు దిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మినరసింహాస్వామి ఆలయం.. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి చదవండి :

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం కోసం మరికొంత భూమి కొనుగోలు.. రూ.2,500 కోట్ల వరకు విరాళాలు..!

Post Office: పోస్టాఫీసుల్లో నగదు ఉపసంహరణలు, డిపాజిట్లలపై చార్జీల వసూలు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు