Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం కోసం మరికొంత భూమి కొనుగోలు.. రూ.2,500 కోట్ల వరకు విరాళాలు..!

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం సముదాయం మరింత విశాలంగా ఉండాలన్న ఉద్దేశంతో అదననంగా మరింత కొంత భూమిని కొనుగోలు చేశారు. శ్రీరామ జన్మభూమికి ఆనుకుని ఉన్న 676.85 చదరపు...

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం కోసం మరికొంత భూమి కొనుగోలు.. రూ.2,500 కోట్ల వరకు విరాళాలు..!
Subhash Goud

|

Mar 03, 2021 | 11:12 PM

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం సముదాయం మరింత విశాలంగా ఉండాలన్న ఉద్దేశంతో అదననంగా మరింత కొంత భూమిని కొనుగోలు చేశారు. శ్రీరామ జన్మభూమికి ఆనుకుని ఉన్న 676.85 చదరపు మీటర్ల భూమిని రూ. 1కోటి చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించారు. శ్రీ రామ జన్మభూమికి ఆనుకుని ఉన్న ఇళ్లు, ఇతర స్థలాలను కొనేందుకు వాటి యజమానులతో చర్చలు జరుగుతున్నాయి. శ్రీరామ జన్మ భూమికి ఆనుకుని ఉన్న ఇళ్లు, ఇతర స్థలాలను కొనేందుకు వాటి యజమానులతో చర్చలు జరుగుతున్నాయి. అయితే స్వామి దీప్‌నారాయణ్‌కు చెందిన ఈ భూమిని కోటి రూపాయలు చెల్లించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కొనుగోలు చేసింది. ఈ ట్రస్ట్‌ జనరల్‌ సెక్రెటరీచంపత్‌ రాయ్‌ ఈ లావాదేవీని నిర్వహించారు. క్రియచీటీపై గోసాయిన్‌గంజ్‌ ఎమ్మెల్యే ఐపీ తివారీ (బీజేపీ), ట్రస్ట్‌ సభ్యుడు, ఆరెస్సెస్‌ అయోధ్య ప్రచారక్‌ డాక్టర్‌ అనిల్‌ మిశ్రా సాక్షులుగా సంతకాలు చేశారు. అయోధ్య రామలయం సాధ్యమైనంత స్థలంలో ఉండాలన్నది అసలు లక్ష్యం.దీనికి అనుగుణంగానే శ్రీరామ జన్మభూమికి ఆనుకుని ఉన్నపాత ఇళ్లు, స్థలాలను ట్రస్ట్‌ కొనుగోలు చేస్తోంది. అయితే 2019 నవంబరు 9న సుప్రీంకోర్టు తీర్పుతో శ్రీరామ జన్మ భూమికి 70 ఎకరాల స్థలం దక్కిన విషయం తెలిసిందే. దీనిని 107 ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుని, డిజైన్లను తయారు చేశారు. గర్భ గుడితో కూడిన రామాలయాన్ని ఐదు ఎకరాల స్థలంలో నిర్మిస్తారు. మ్యూజియం, గ్రంథాలయం, యాగశాల, శ్రీరాముని జీవితాన్ని వివరించే తదితర చిత్రపటాల ప్రదర్శన వంటివాటి కోసం మిగిలిన స్థలాన్ని వినియోగించనున్నారు.

భారీగా నిధుల సేకరణ:

కాగా, రామాలయం నిర్మాణం కోసం నిధి సేకరణను జనవరి15వ తేదీ నుంచి 44 రోజులపాటు కొనసాగింది. ఈ క్రమంలో రూ.2,500 కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27తో ఈ విరాళాల కార్యక్రమం ముగిసింది. అయితే విరాళాలలో భాగంగా ప్రజల నుంచి స్వచ్చందంగా విరాళాలు సేకరించారు. సేకరించిన విరాళాల డబ్బును బ్యాంకులో డిపాజిట్‌ చేయగా, ఇంకా కొంత డబ్బు జమ చేయాల్సి ఉందని ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. దీంతో విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. అయోధ్య రామజన్మ భూమి ట్రస్ట్‌ కార్యాలయ ఇన్‌చార్జీ ప్రకాశ్‌ ఉప్తా ఇటీవల ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ… ప్రస్తుతానికి మేము సేకరించిన విరాళాల మొత్తాన్ని అంచనా వేశామని, ఇది దాదాపు 2 వేల కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అన్నారు. మొత్తం ఎంత విరాళం సేకరించామనే లెక్కలు తేలడానికి నెల రోజుల సమయం పడుతుందని అన్నారు.

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన చాలా చెక్కులు ఇకా బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే పెండింగ్‌లో ఉన్న మొత్తం ఎంతనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు. ఆ తర్వాత పూర్తి మొత్తం ఎంత విరాళాలు సేకరించామనేది తేలుతుందని అన్నారు. కాగా, అయోధ్యలో రామాలయం నిర్మాణ ఖర్చు అంచనా వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లించిన విషయం తెలిసిందే. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ.1,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయోధ్య ప్రధాన ఆలయానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపింది. అయోధ్యలో రామాలయాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. నిపుణుల సారథ్యంలో ఆలయ ఆకృతులు రూపకల్పన జరుగుతుందన్నారు.

అయితే రామాలయ రూపకల్పనలో ఐఐటీలు, ఇతర సంస్థల సాయం చేయనున్నాయని, ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ ద్వారా రూ.100 కోట్లకుపైగా విరాళాలు అందాయని వెల్లడించారు. అలాగే దాదాపు 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాల దగ్గరకు వెళ్తామని ప్రకటించినట్లుగానే అన్ని ప్రాంతాలకు వెళ్లి విరాళాలు సేకరించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది. కేవలం స్వదేశీ నిధులతోనే రామ మందిరం నిర్మాణం జరుగుతుందని శ్రీరామ ట్రస్ట్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. భారీ ప్రచార కార్యక్రమం ద్వారా వీటిని సాధారణ పౌరుల నుంచి మాత్రమే సేకరిస్తామని, ఇందు కోసం రూ.10, రూ.100, రూ.1000 విలువగల కూపన్లను అందుబాటులో ఉంచుతూ విరాళాలు సేకరించింది రామ జన్మభూమి ట్రస్ట్‌.

ఇది చదవండి: ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దేశద్రోహమవుతుందా ? సుప్రీంకోర్టు, ‘పిల్’ కొట్టివేత

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu