TRSPP Meeting: రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు దిశానిర్ధేశం!

|

Jan 29, 2022 | 1:45 PM

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు(CM KCR) అధ్యక్షతన ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.

TRSPP Meeting: రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు దిశానిర్ధేశం!
Cm Kcr
Follow us on

TRS parliamentary party Meeting: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (TRS parliamentary party) సమావేశం రేపు మధ్యహ్నం జరగనుంది. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు(CM KCR) అధ్యక్షతన ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రాజ్యసభ్య, లోక్‌సభకు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Meeting 2022) ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యుహాంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం చేయనున్నారు. టీఆర్‌ఎస్‌పీపీ సమావేశంలో.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యుహాంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ సమస్యలపై సీఎం కేసీఆర్ ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన వినతులపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించనున్నారు. అయితే, ఈ సారి కేంద్రంతో గట్టిగానే పోరాటం చేయాలని సూచించనున్నట్లు తెలుస్తోంది.

ఇక, ఈనెల 31 సోమవారం నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సారి కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ సమావేశాలు.. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్‌లో సానిటేషన్‌ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఇక, పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఉభయసభలలో టీఆర్‌ఎస్ ఎంపీలు తొలి రోజు నుంచే ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ సమాధానంపై టీఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.

Read Also…. AP PRC: ఏపీలో కొనసాగుతున్న పీఆర్‌సీ పంచాయితీ.. మాటలు లేవు.. మాట్లాడుకోవటాలు లేవు!