Telanga CETs Dates: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖ‌రారు… ఎంసెట్, పీజీఈసెట్‌, ఈసెట్ నిర్వహణ

|

Feb 13, 2021 | 6:12 PM

Telanga CETs Dates: 2021-22 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం అండర్ గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం కోసం మూడింటి షెడ్యూల్ ను ప్రకటించింది. ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కీలకమైన ఎంసెట్‌, ఈసెట్‌, పీజీసెట్‌ ల ప్రవేశానికి పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ టి. పాపి రెడ్డి […]

Telanga CETs Dates: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖ‌రారు... ఎంసెట్,  పీజీఈసెట్‌, ఈసెట్ నిర్వహణ
Follow us on

Telanga CETs Dates: 2021-22 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం అండర్ గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం కోసం మూడింటి షెడ్యూల్ ను ప్రకటించింది. ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కీలకమైన ఎంసెట్‌, ఈసెట్‌, పీజీసెట్‌ ల ప్రవేశానికి పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ టి. పాపి రెడ్డి షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. జులై 5న ఎంసెట్‌ , జూన్ 20న పీజీఈసెట్ , జులై 1న ఈసెట్ లు నిర్వహించనున్నామని తెలిపారు.

ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గాను తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు జరగనున్నాయని చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షలను హైదరాబాద్ జేఎన్‌టీయూ నిర్వహిస్తుందని.. ప్రొఫెసర్ ఎ గోవర్ధన్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారని చెప్పారు.

ఇక బిఇ / బి టెక్ / బి ఫార్మ్‌ ప్రవేశ పరీక్షల కోసం తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను జూలై 1 న నిర్వహించనున్నామని.. కన్వీనర్‌గా జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ వెంకటరమణారెడ్డి వ్యవహరించనున్నారు.

ME / ఎంటెక్ / ఎం ఫార్మసీ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులకు పీజీఈసెట్‌ జూన్ 20 నుంచి నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఉస్మానియా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ ఈ పరీక్షకు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

మరోవైపు టీఎస్‌ ఎడ్‌సెట్‌, ఐసెట్‌, లాసెట్‌, పీజీలాసెట్‌, టీఎస్‌పీఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయించాల్సి ఉందని చెప్పారు చైర్మన్ పాపిరెడ్డి. దేశంలో అల్లకల్లోలం సృష్టించిన కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వరుసగా రెండవ సంవత్సరం, ప్రవేశ పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యం జరుగుతుందని అన్నారు.

Also Read:

 : ఏపీలో మొదలైన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్.. వెలువడుతోన్న ఫలితాలు.

ఉత్తరాఖండ్ లో ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు, 34 మందిని కాపాడేందుకు ముమ్మర యత్నాలు