తెలంగాణ‌ పోలీస్ శాఖలో సంచ‌ల‌నం : వ‌రుస సస్పెన్ష‌న్లు

|

Aug 19, 2020 | 11:02 AM

ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన స్పెషల్‌ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ చందర్‌కుమార్‌పై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌‌ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ‌ పోలీస్ శాఖలో సంచ‌ల‌నం : వ‌రుస సస్పెన్ష‌న్లు
Follow us on

ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన స్పెషల్‌ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ చందర్‌కుమార్‌పై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌‌ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. ఫిర్యాదుపై స‌మ‌గ్ర‌ ద‌ర్యాప్తు అనంత‌రం చందన్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మ‌రోవైపు న‌టి శ్రీ సుధ కేసులో సీఐ మురళి కృష్ణ కూడా లంచం తీసుకున్నాడన్న ఆరోప‌ణ‌ల‌తో అత‌న్ని కూడా సస్పెండ్ చేశారు అంజ‌నీకుమార్. ఒకేరోజు ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల‌ను సస్పెండ్ చెయ్య‌డం సంచ‌ల‌నంగా మారింది.

కాగా ఇవి జ‌రిగిన మ‌రో 24 గంటల్లోనే.. ఒకే పోలీస్ స్టేషన్‌కు సంబంధించి కేసుల వ్యవహారంలో మ‌రో ముగ్గురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. నగర శివారులో భూముల విషయంలో కబ్జాదారులు పోలీసులతో కుమ్మక్కై సెటిల్మెంట్లకు దిగిన‌ట్లు ఫిర్యాదులు అందాయి. పూర్తి విచారణ జరిపిన అనంత‌రం ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ల్యాండ్ సెటిల్మెంట్ల‌కు సంబంధించిన‌ వ్యవహారం మొత్తం విచారించేందుకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్.

Also Read :

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

వారికి త‌క్ష‌ణ సాయంగా రూ.2 వేలు : ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు