Atmakur SI Lingam: ఆత్మకూర్‌ గిరిజన యువకుడిపై ఎస్సై దాడి.. జిల్లా ఎస్పీ ఆగ్రహం.. కీలక ఆదేశాలు

| Edited By: Sanjay Kasula

Nov 12, 2021 | 4:30 PM

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ ఎస్సై లింగంపై వేటు పడింది. ఎస్సై లింగంను వీఆర్‌కు అటాచ్‌ చేశారు ఎస్పీ రాజేంద్రప్రసాద్. దొంగతనం కేసులో..

Atmakur SI Lingam: ఆత్మకూర్‌ గిరిజన యువకుడిపై ఎస్సై దాడి.. జిల్లా ఎస్పీ ఆగ్రహం.. కీలక ఆదేశాలు
Atmakur Si Lingam
Follow us on

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ ఎస్సై లింగంపై వేటు పడింది. ఎస్సై లింగంను వీఆర్‌కు అటాచ్‌ చేశారు ఎస్పీ రాజేంద్రప్రసాద్. దొంగతనం కేసులో యువకుడిని ఎస్సై లింగం చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలతో.. ఆతనిపై డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకుంది. ఆత్మకూరు ఎస్సై లింగయ్య వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఉప్పల్‌లో ఎస్సైగా పనిచేసిన లింగయ్య.. ఓ కేసులో సస్పెన్షనకు గురై సూర్యాపేటకు బదిలీ అయ్యారు.  సూర్యాపేటలోనూ లింగయ్యపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఓవ్యక్తిని ఇష్టమొచ్చినట్టు చితకబాదడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా లాక్‌డౌన్‌లోనూ లాఠీకి పనిచెప్పారు ఎస్సై లింగయ్య. ఓ నర్సు భర్తపై చేయి చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.

ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. సూర్యాపేట నుంచి వీఆర్‌కు లింగయ్యను బదిలీ చేశారు. ఆ తర్వాత వీఆర్‌ నుంచి ఆత్మకూర్ పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఓ నేత ప్రమాణ స్వీకారానికి వెళ్లాడన్న కక్షతో.. సింహాద్రి అనే యువకుడిపై అక్రమ కేసు బనాయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు శరామోజీ తండాకు చెందిన ధరావత్ వీర శేఖర్‌ని.. ఓ దొంగతనం కేసులో అకారణంగా ఇరికించారు. ఇంటరాగేషన్ పేరుతో చావబాదారనే ఆరోపిస్తున్నారు బాధితులు. మహేశ్ అనే కానిస్టేబుల్‌తో కలిసి ఎస్సై లింగయ్య.. ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..

Kashi Annapurna: 100 ఏళ్ల క్రితం చోరీ.. 4 ఏళ్ల కృషి.. కాశీకి చేరిన అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి..