Telangana: అగ్నిప్రమాదం ఇలా కూడా జరుగుతుందా.. గతంలో ఎప్పుడూ చూసి ఉండరు.. ఇదిగో వీడియో..

అగ్నిప్రమాదం ఏ రూపంలో ముంచుకొస్తుందో.. ఎప్పుడు కాళీ బూడిదగా మారుస్తుందో ఊహించడం ఎవరి తరమూ కాదు. ముఖ్యంగా నిప్పుతో చెలగాటం ప్రాణాంతకమని హెచ్చరిస్తున్న వేళ, మహబూబాబాద్ జిల్లాలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అడవిలో చెలరేగిన మంటలు.. గాలిలో ఎగిసిపడిన ఒక్క నిప్పు రవ్వ.. వెళ్తున్న వాహనాన్ని చూస్తుండగానే అగ్నిగుండంగా మార్చేశాయి. అసలేం జరిగిందంటే..?

Telangana: అగ్నిప్రమాదం ఇలా కూడా జరుగుతుందా.. గతంలో ఎప్పుడూ చూసి ఉండరు.. ఇదిగో వీడియో..
Gunny Bag Load Van Destroyed In Massive Fire

Edited By:

Updated on: May 01, 2026 | 8:05 PM

అగ్నిప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా భానుడి భగభగలకు ఎండుటాకులు నిప్పు కణాల్లా మారుతున్న వేళ, ఏమరపాటుగా ఉంటే ఎంతటి అనర్థం జరుగుతుందో మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ విచిత్ర ఘటనే నిదర్శనం. అడవిలో చెలరేగిన మంటల సెగ.. గాలిలో ఎగిసిపడిన నిప్పు రవ్వలు.. వెళ్తున్న వాహనాన్ని చూస్తుండగానే అగ్నిగుండంగా మార్చేశాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గువ్వలపాడు సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నర్సంపేట నుండి గంగారానికి మొక్కజొన్న కొనుగోళ్ల నిమిత్తం గన్నీ సంచుల లోడ్‌తో ఒక  మినీ వ్యాన్ బయలుదేరింది. ఖానాపూర్ మండలం చిలకమ్మనగర్ ప్రాంతానికి రాగానే అక్కడ అడవిలో మంటలు చెలరేగి ఉండడాన్ని డ్రైవర్ గమనించాడు. అయితే వాహనం వేగంగా వెళ్తున్న క్రమంలో అడవి మంటల నుండి ఎగిసిపడిన ఒక్క నిప్పు రవ్వ వ్యాన్ వెనుక ఉన్న గన్నీ సంచులపై పడింది.

వేగం తోడై.. మంట వ్యాపించి

వాహనం వేగంగా ఉండటంతో గాలికి ఆ నిప్పు కణం కాస్తా క్షణాల్లోనే పెద్ద మంటగా మారింది. కొత్తగూడ శివారులోని గాదెవాగు వద్దకు రాగానే వెనుక మంటలు చెలరేగడాన్ని డ్రైవర్ రియర్ వ్యూ అద్దంలో చూసి షాక్ అయ్యాడు. వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ మంటలు అప్పటికే టైర్లకు పాకడంతో, వేడికి టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో వాహనం నియంత్రణ తప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది.

కళ్లముందే బూడిదైన వాహనం

బోల్తా పడిన వాహనంలో మంటలు మరింత ఉధృతమయ్యాయి. వ్యాన్‌లో ఉన్న వేల సంఖ్యలో గన్నీ సంచులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ, మంటలు వ్యాపించిన వెంటనే స్థానిక బాటసారులు కేకలు వేస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో వాహనం బోల్తా పడినా, డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. లక్షలాది రూపాయల విలువైన ఆస్తి నష్టం సంభవించడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us