Many Traffic Challans pending on TS Minister Vehicles: రోడ్లపై కాస్త స్పీడ్ దాటితేనే.. ఇలా క్లిక్ మనిపించి.. వేలకు వేల ఫైన్లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. 10 ట్రాఫిక్ చలాన్లు మించితే ఛార్జిషీట్ దాఖలు చేసి, కోర్టులో ప్రవేశపెడతామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లఘించినందుకు తెలంగాణ మంత్రుల కార్లపై కూడా భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదవుతున్నాయి. అవి సంవత్సరాల తరబడి నుంచి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. ఇవన్నీ ఓవర్ స్పీడ్ చలాన్లు కావడమే గమనార్హం.
వారిలో మంత్రి జగదీష్ రెడ్డి కార్‌పై 9 అత్యధికంగా ట్రాఫిక్ చలానాలతో రూ.9,315 జరిమాన నమోదవ్వగా, ఈటల రాజెందర్ 6 చలాన్లకు గానూ 6,210ల ఫైన్ ఉంది, కొప్పుల ఈశ్వర్ 5 చలాన్లకు రూ.5,175లు ఉంది. సబితా ఇంద్రా రెడ్డి సొంత వాహనంపై 5లకు రూ.2,775 జరిమానా ఉంది. ఇక గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ వాహనాలపై 3 చలాన్లు ఉండగా, శ్రీనివాస్ గౌడ్ వాహనంపై రెండు చలాన్లు నమోదయ్యాయి. మరి వీరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చూడాలి. అయితే.. వారు మంత్రులు కావడంతో రూల్స్ బ్రేక్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.