Viral: బోల్ట్‌ మింగేసిన ఆరేళ్ల బాలుడు.. వైద్యులు ఎలా తీశారో చూడండి. వీడియో..

| Edited By: Narender Vaitla

Jan 06, 2024 | 10:45 AM

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం హత్యాతండాకు చెందిన బాదవత్ హర్ష అనే ఆరు సంవత్సరాల బాలుడు, ఆడుకుంటూ పొరపాటు ఓ చిన్న ఇనుప బోల్ట్‌ను మింగేశాడు. దీంతో ఈ విషయాన్ని గమనించిన బాలుడి పేరెంట్స్‌ ఒక్కసారిగా కంగారు పడ్డారు. అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా...

Viral: బోల్ట్‌ మింగేసిన ఆరేళ్ల బాలుడు.. వైద్యులు ఎలా తీశారో చూడండి. వీడియో..
Children Swallow Bolt
Follow us on

తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్న కొన్ని సందర్భాల్లో చిన్నారులు చేసే పనులు ప్రమాదాలు తెచ్చిపెడుతుంటాయి. వారికి తెలియక చేసే పనులు వారి ప్రాణాలకు ముప్పు తెస్తుంటాయి. తాజాగా ఖమ్మంల జిల్లాలో జరిగిన ఓ సంఘటన చిన్నారుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజెబుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం హత్యాతండాకు చెందిన బాదవత్ హర్ష అనే ఆరు సంవత్సరాల బాలుడు, ఆడుకుంటూ పొరపాటు ఓ చిన్న ఇనుప బోల్ట్‌ను మింగేశాడు. దీంతో ఈ విషయాన్ని గమనించిన బాలుడి పేరెంట్స్‌ ఒక్కసారిగా కంగారు పడ్డారు. అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలుడిని ఖమ్మం పట్టణంలోని ఆ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముందుగా ఎక్స్‌రే తీయగా బోల్ట్‌ లోపలికి వెళ్లినట్లు గుర్తించారు.

అనంతరం ఎలాంటి ఆపరేషన్‌ లేకుండానే ఎండోస్కోపీ విధానం ద్వారా ఇనుప బోల్ట్‌ను బయటకు తీశారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమ కుమారుడి ప్రాణాలు రక్షించినందుకు వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా తమ వద్దకు వస్తున్నట్లు వైద్యం అందించిన డాక్టర్‌ జంగాల సునీల్‌ కుమార్‌ తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి 4 కేసులు తమ వద్దకు వచ్చాయని, వారిని కూడా ఇలాగే రక్షించినట్లు తెలిపారు.

ఇక చిన్నారుల విషయంలో పేరెంట్స్‌ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు ఆడుకునే సమయంలో వారిపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే వైద్యుడి బోల్ట్‌ను ఎండోస్కోపీ విధానంలో తొలగిస్తున్న వీడియో చూసిన వారు షాక్‌ అవుతున్నారు. మరి ఆ వీడియోను మీరు ఓసారి చూసేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..