ఉగాది పండుగ రోజున తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. తెలంగాణ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్‌ఆస్పత్రి చికిత్స పొందుతూ మంగళవారం(ఏఫ్రిల్9) తెల్లవారుజామున మృతి చెందారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.మంగళవారం తెల్లవారుజామున ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటీన ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
1991 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఆఫీసర్ రాజీవ్ రతన్ హఠాన్మరణం పట్ల పోలీస్ శాఖ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. గత డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేసిన టైంలో తెలంగాణ కొత్త పోలీస్ బాస్ రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. రాజీవ్ రతన్ గతంలో కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డీజీగా, హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో పని చేశారు. ఇటీవల తెలంగాణ విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ డీజీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…