Hyderabad: హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న వృద్ధ జంట ధర్నా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

Hyderabad: ఓ వృద్ధ జంట సొంత ఇంటి ఎదుటే ధర్నా చేపట్టడం భాగ్యనగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కన్న కొడుకే వారు రోడ్డుపైకి రావడానికి అసలు కారణమైంది.

Hyderabad: హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న వృద్ధ జంట ధర్నా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Protest

Updated on: Jun 28, 2022 | 1:53 PM

Hyderabad: ఓ వృద్ధ జంట సొంత ఇంటి ఎదుటే ధర్నా చేపట్టడం భాగ్యనగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కన్న కొడుకే వారు రోడ్డుపైకి రావడానికి అసలు కారణమైంది. అయితే, ఈ వ్యవహారంపై అధికారులు స్పందించినా.. ఫలితం లేకపోయింది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొడుకు, కోడలు చేసిన అన్యాయంపై ఆ వృద్ధ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. తమను ఇంటి నుంచి తరిమేసి.. వేధిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చీకటి గదిలో బందించి చిత్రహింసలకు గురి చేశారని వృద్ధదంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్.. ఇంటిని ఖాళీ చేయించి.. వృద్ధులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. రాచకొండ సీపీ, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో రెవెన్యూ అధికారులు, పోలీసులతో వృద్ధులతో కలిసి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఇంటికి తాళం వేసి కొడుకు, కోడలు పరారయ్యారు. దాంతో ఆ వృద్ధ దంపతులు ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us