Telangana: ఓరి మీకు కాలం రాను.. జనాలు తిరిగే రోడ్డులో ఇదేం పనిరా..

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామ శివారులోని గోవిందరాజుల స్వామి ఆలయం సమీపంలో అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. కుండ, కొబ్బరికాయ, గుమ్మడికాయ, పసుపు, కుంకుమ వంటి వస్తువులు రహదారి పక్కన ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. .. ..

Telangana: ఓరి మీకు కాలం రాను.. జనాలు తిరిగే రోడ్డులో ఇదేం పనిరా..
Suspected Ritual Items

Edited By:

Updated on: Nov 12, 2026 | 6:03 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సనుగుల గ్రామ శివారులో కనిపించిన కొన్ని వస్తువులు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. చందుర్తి మండలం సనుగుల గ్రామం సమీపంలోని గోవిందరాజుల స్వామి ఆలయం మూలమలుపు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేసినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లు గ్రామస్థుల్లో చర్చకు దారితీశాయి. రహదారి పక్కనే కుండ, కొబ్బరికాయ, గుమ్మడికాయ, పాత బట్టలు, పసుపు, కుంకుమ వంటి వస్తువులు కనిపించడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వస్తువులను ఎవరు అక్కడ ఉంచారు? ఏ ఉద్దేశంతో పూజలు నిర్వహించారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. సనుగుల గ్రామ శివారు నుంచి దేవునితండా, జలపాతతండా, వట్టిమల్ల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఈ వస్తువులు కనిపించాయి. ఈ మార్గంలో నిత్యం గ్రామస్థులు, రైతులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వారు అక్కడి దృశ్యాలను చూసి ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ సమాజంలో కొనసాగుతున్న మూఢనమ్మకాలు ఇలాంటి ఘటనలతో ప్రజల్లో అనవసర భయాలను కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ కనిపించిన వస్తువుల వెనుక అసలు కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియదు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి ఘటనపై పరిశీలన జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే ప్రజల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

మరోవైపు, రహదారుల పక్కన అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటిని తాకకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మొత్తానికి సనుగుల గ్రామ శివారులో కనిపించిన ఈ వస్తువులు ప్రస్తుతం పరిసర గ్రామాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us