బ్రేకింగ్: నెహ్రూ జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

| Edited By:

Jul 05, 2020 | 4:53 PM

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. శనివారం రాత్రి జూపార్కులో 11 ఏళ్ల వయస్సున్న కదంబ మరణించింది. 2014లో కర్నాటక మంగళూరు పార్కు నుంచి కదంబను..

బ్రేకింగ్: నెహ్రూ జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి
Follow us on

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. శనివారం రాత్రి జూపార్కులో 11 ఏళ్ల వయస్సున్న కదంబ మరణించింది. 2014లో కర్నాటక మంగళూరు పార్కు నుంచి కదంబను తీసుకొచ్చారు సిబ్బంది. గత కొంత కాలంగా రాయల్ బెంగాల్ టైగర్ కదంబ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తెల్లరంగులో ఉండి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకునేవి రాయల్ బెంగాల్ టైగర్లు. అయితే కదంబ కుటుంబానికి చెందిన కొన్ని రాయల్ బెంగాల్ టైగర్లు ట్యూమర్‌ వ్యాధితో మృతి చెందాయి. ఇప్పుడు కదంబ మృతికి కూడా అదే కారణమయి ఉండొచ్చని పార్క్ నిర్వాహకులు అనుమానిస్తున్నారు. అయితే బెంగాల్ టైగర్ ఏ కారణంతో మరణించిందోనని వైద్య పరీక్షలు చేయిస్తున్నారు జూ పార్కు సిబ్బంది. కాగా ప్రస్తుతం ఈ వార్త విన్న టైగర్‌ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More: 

కరోనా ఎఫెక్ట్: నెల్లూరులో మూతపడ్డ పోలీస్ స్టేషన్

నాగాలాండ్‌లో కుక్క మాంసం బ్యాన్..