Hyderabad Telugu University: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీలో వివిధ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా జాయిన్ అవ్వాలని సూచించింది. నిర్ణీత తేదీన సాయంత్రంలోగా సంబంధిత శాఖలలో నిర్ణీత ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందాలని అభ్యర్థులకు యూనివర్సిటీ సూచించింది. లేనిపక్షంలో ఆ సీటును ఇతరులకు కేటాయించడం జరుగుతుందని తెలిపింది.
ఆ మేరకు యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో యూనివర్సిటీ సెంట్రల్ అడ్మిషన్ కమిటీ కన్వీనర్ స్పష్టం చేశారు. కాగా, ఎంఏ జర్నలిజం, ఎంఏ జ్యోతిష్యం, ఎంఏ తెలుగు, ఎంఏ నృత్యం, బీఎఫ్ఏ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 11, 12వ తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అర్హులైన అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. దాంతో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా అడ్మిషన్ పొందాలంటూ అధికారులు సూచించారు.
Also read:
Adipurush Update: ‘ఆదిపురుష్’ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. మోషన్ క్యాప్చర్ పనులు షురూ..
Haritha Hotels: లీజుకు తెలంగాణ హరిత హోటళ్లు… మీకు ఆసక్తి ఉందా.. అయితే ఇలా అప్లై చేసుకోండి..