అడవులపై పట్టుకోసం అడుగడుగునా ల్యాండ్ మైన్స్.. వారి కుట్రను పోలీసులు భగ్నం..

తెలంగాణ - చత్తీస్గడ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మావోయిస్టుల మందు పాతరలు అమాయకుల ప్రాణాలు మింగేస్తుంటే.. మావోయిస్టుల కదలికలపై ఖాకీల నిఘా ముమ్మరం చేశారు. భారీ విధ్వంసానికి వ్యూహరచన చేస్తున్న మావోయిస్టు పార్టీ డిప్యూటీ కమాండర్‎తో సహా దళాలసభ్యులు, మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు మావోయిస్టుల మందు పాతరలు ప్రజల ప్రాణాలు మింగేస్తుంటే..మరోవైపు మావోయిస్టులను మట్టు పెట్టేందుకు ములుగు జిల్లా ఏజెన్సీలో పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

అడవులపై పట్టుకోసం అడుగడుగునా ల్యాండ్ మైన్స్.. వారి కుట్రను పోలీసులు భగ్నం..
Police Oparation
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 16, 2024 | 10:05 AM

తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మావోయిస్టుల మందు పాతరలు అమాయకుల ప్రాణాలు మింగేస్తుంటే.. మావోయిస్టుల కదలికలపై ఖాకీల నిఘా ముమ్మరం చేశారు. భారీ విధ్వంసానికి వ్యూహరచన చేస్తున్న మావోయిస్టు పార్టీ డిప్యూటీ కమాండర్‎తో సహా దళాలసభ్యులు, మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు మావోయిస్టుల మందు పాతరలు ప్రజల ప్రాణాలు మింగేస్తుంటే.. మరోవైపు మావోయిస్టులను మట్టు పెట్టేందుకు ములుగు జిల్లా ఏజెన్సీలో పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే మావోయిస్టుల మరో కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఒక డిప్యూటీ కమాండర్ స్థాయి మావోయిస్టుతో పాటు పలువురు మిలిషియా సభ్యులను అరెస్టు చేశారు.

తెలంగాణ- ఛత్తీస్గడ్ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేశారు. కర్రె గుట్టపై గెరిల్లా బేస్ ఏర్పాటు చేయడంలో భాగంగా స్పెషల్’ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు అడవిలోకి వస్తే ల్యాండ్ మైన్స్ పేల్చి హతమార్చాలనే కుట్రతో వ్యూహ రచన చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీ డిప్యూటీ దళ కమాండర్ రీతాతో పాటు ఇద్దరు దళ సభ్యులు, ముగ్గురు మిలిషియా సభ్యులను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కారం భుద్రి వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యుటీ కమాండర్, పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు, బెటాలియన్ సభ్యుడు, మిలిషియా సభ్యుడు ఉన్నారు. వీరి వద్ద DBBL ఆయుధాలతో పాటు, ల్యాండ్ మైన్స్, పేలుడు పదార్థాలు, కిట్ బ్యాగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరి ద్వారా మావోయిస్టు పార్టీకి సహకరించే మరి కొంతమంది సానుభూతిపరులు, కొరియర్స్ వివరాలు విచారణలో తెలిశాయని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles