Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి.. హరీష్‌రావుతోపాటు మాజీ డీసీపీపై కేసు నమోదు

| Edited By: TV9 Telugu

Dec 04, 2024 | 5:19 PM

రియల్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీష్‌రావుతోపాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పంజాగట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి.. హరీష్‌రావుతోపాటు మాజీ డీసీపీపై కేసు నమోదు
Harish Rao, Radhakishan Rao
Follow us on

ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం మరోసారి సంచలనంగా మారుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసు నమోదయ్యింది. తన ఫోన్‌ కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కేసు నమోదు అయ్యింది.

మాజీమంత్రి హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌‌గౌడ్ అనే రియల్ ఏస్టేట్ వ్యాపారి ఈ ఫిర్యాదు చేశారు. గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తన ఫోన్‌ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు చక్రధర్‌‌గౌడ్. ఆయన ఫిర్యాదు మేరకు హరీష్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అధికారులు. సెక్షన్ 120 (b), 386, 409, ఐటీ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.