Danam Nagendar: దానం నాగేందర్‌ ఎంపీ అభ్యర్థిత్వం సొంత పార్టీలోనే అసంతృప్తి.. ఏకంగా కోర్టుకే..!

|

Mar 28, 2024 | 8:38 AM

పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవ్వగా.. ఆయనకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ వేశారు రాజుయాదవ్. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.

Danam Nagendar: దానం నాగేందర్‌ ఎంపీ అభ్యర్థిత్వం సొంత పార్టీలోనే అసంతృప్తి.. ఏకంగా కోర్టుకే..!
Danam Nagender
Follow us on

పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవ్వగా.. ఆయనకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ వేశారు రాజుయాదవ్. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.

దానం నాగేందర్‌పై ఖైరతాబాద్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ కోవర్టుగా దానం కాంగ్రెస్‌లోకి వచ్చారంటూ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఎంపీ అభ్యర్థిత్వాన్ని రద్దు చెయ్యాలని AICCకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆఫీస్ ముందు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఎంపీగా గెలిచినా దానం మళ్లీ పార్టీ మారతారని స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నమ్మకం కుదరాలంటే దానం ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేత రాజు యాదవ్.

దానంపై అనర్హత వేటు వెయ్యాలని ఇప్పటికే స్పీకర్‌కి రాజుయాదవ్ ఫిర్యాదు చేశారు. నాగేందర్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ మేరకు దానం నాగేందర్‌పై అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. దానంకు వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. దానం నాగేందర్ బలమైన నేత అనుకొని టిక్కెట్ ఇచ్చారని, కానీ తమ దృష్టిలో ఆయన బలమైన నాయకుడేమీ కాదన్నారు రాజుయాదవ్. పార్టీ అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చింది కాబట్టే తాము వ్యతిరేకించడం లేదన్నారు. ఫైనల్‌గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తే.. దానం నాగేందర్ ఎంపీగా గెలుస్తాడన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…