Paddy Purchase: ఇవాళ్టి నుంచి తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు..ఈ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనాలని టార్గెట్..

|

Apr 15, 2022 | 9:30 AM

Paddy Procurement: తెలంగాణలో పండిన ప్రతి గింజను కొంటాం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన ప్రభుత్వం..ధాన్యం కొనుగోలు కేంద్రాలు(Paddy Procurement) ఏర్పాటుచేసింది. ఇవాల్టి నుంచి ధాన్యం కొనుగోళ్లు..

Paddy Purchase: ఇవాళ్టి నుంచి తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు..ఈ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనాలని టార్గెట్..
Paddy Purchase In Telangana
Follow us on

తెలంగాణలో పండిన ప్రతి గింజను కొంటాం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన ప్రభుత్వం..ధాన్యం కొనుగోలు కేంద్రాలు(Paddy Procurement) ఏర్పాటుచేసింది. ఇవాల్టి నుంచి ధాన్యం కొనుగోళ్లు(Paddy purchase) ప్రారంభంకానున్నాయి. ఈ సీజన్‌లో 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కోటి 60 లక్షల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 8 కోట్ల గోనె సంచుల సేకరణకు 25న టెండర్లు పిలవనున్నారు. ఈ సీజనులో సుమారు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

నిజామాబాద్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వడ్ల కొనుగోల్లు నిర్వహిస్తున్నారు. ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో సాధారణ బియ్యంగానే మార్చాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మునుపటి మాదిరిగానే మిల్లులకు పంపనున్నారు. సాధారణ బియ్యంగా మార్చటం ద్వారా నూకలు అధిక శాతం రానున్న దృష్ట్యా మిల్లర్లకు నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, మిల్లింగ్‌ చేస్తే నూకలు ఎంత శాతం వస్తాయన్నది నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.

ఇదిలావుంటే.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 236 కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటుచేశారు. రఘునాధపాలెం మండలం మంచుకొండలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్. జిల్లాలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగే అవకాశం ఉందని..అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చేసినా కేంద్రం పట్టించుకోలేదని..రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకునేది కేసీఆర్‌ ఒక్కరేనంటున్నారు టీఆర్‌ఎస్‌ శ్రేణులు.

కొన్నాళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి వార్‌తో ఆందోళన చెందారు రైతులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొంటారో లేదో అనే అనుమానం రైతులను వెంటాడింది. ఐతే ప్రతి గింజను మేమే కొంటామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు.

ఇవి కూడా చదవండి: Owaisi Convoy: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి చేదు అనుభవం.. కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆందోళనకారులు

China: అల్లాడిపోతున్న చైనా.. ఆదుకోవాలంటూ అరుపులు, కేకలతో జనం హాహాకారాలు..!