Telangana: తాగితే రూ.5 వేలు.. అమ్మితే రూ.10వేలు.. ఈ ఊరి రూటే సపరేట్.. ఒక్క నిర్ణయంతో అందరికీ ఆదర్శం..

ఆ ఊరి పొలిమేర దాటి మద్యం లోపలికి రావడానికి వీల్లేదు. తాగితే ఒక శిక్ష.. అమ్మితే మరో శిక్ష.. చివరకు చుట్టాలొచ్చినా సరే రూల్స్ పాటించాల్సిందే.. యువతను సన్మార్గంలో నడపడమే లక్ష్యంగా, చితికిపోతున్న సంసారాలను చక్కదిద్దడమే ధ్యేయంగా కొమురంభీం జిల్లాలోని ఒక చిన్న గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం కథ తెలుసుకుందాం..

Telangana: తాగితే రూ.5 వేలు.. అమ్మితే రూ.10వేలు.. ఈ ఊరి రూటే సపరేట్.. ఒక్క నిర్ణయంతో అందరికీ ఆదర్శం..
Liquor Ban In Shirsha Village

Edited By:

Updated on: Apr 30, 2026 | 4:13 PM

ఆ గ్రామంలో మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తూ ఏకగ్రీవ తీన్మారం చేశారు. మద్యం అమ్మితే పది వేలు తాగితే 5 వేల జరిమానా విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గ్రామానికి అతిథిగా వచ్చిన వారు సైతం ఈ నిబంధనలు పాటించి తీరాల్సిందినేనని.. లేదంటే జరిమానా తప్పదని చెబుతున్నారు. యువతను సన్మార్గంలో నడపడంతో పాటు మత్తుకు మద్యానికి బానిసైన వ్యక్తుల్లో మార్పును తీసుకు వచ్చేందుకే ఈ నిర్ణయం అంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తున్న ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే కొమురంభీం జిల్లాకు వెళ్లాల్సిందే.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని శీర్షా గ్రామంలో గ్రామస్థులు సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం చేసి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. గురువారం సర్పంచ్‌ మల్లేష్ ఆధ్వర్యంలో గ్రామపెద్దలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. గ్రామంలో బెల్టుషాపులను పూర్తిగా మూసివేయాలని, మద్యం విక్రయించే వారిపట్ల కఠినంగా వ్యహరించడంతో పాటు రూ.10 వేల జరిమానా విధించిడం జరుగుతుందన్నారు. మద్యం అమ్మడమే కాదు తాగినా కఠిన చర్యలు ఉంటాయంటూ తెలిపారు. మద్యం తాగితే 5 వేలజరిమానా విధిస్తామని తెలిపారు. గ్రామంలో మద్యం విక్రయాల గురించి తగిన ఆధారాలతో సమాచారాన్ని అందజేసిన వారికి రూ.2 వేల నజరానా కూడా ఇవ్వడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. గ్రామంలోకి వచ్చే అతిథిలు సైతం మద్యపాన నిషేదాన్ని పాటించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. మద్యపానంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తాగి వీధుల్లో అల్లర్లు చేసే వారిపై సైతం కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు.

వీడియో చూడండి..

Follow Us