Telangana: ముఖ్యమంత్రి సారూ..! నేను గుర్తున్నానా.. నా సాయం అప్పుడే మరిచారా?

| Edited By: Balaraju Goud

Dec 12, 2024 | 3:53 PM

బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో విద్యార్థులకు మద్దతుగా రైతు సహాయ సాకారాలను‌ గుర్తించి మన ప్రభుత్వం వస్తే అన్ని‌ విధాల ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana: ముఖ్యమంత్రి సారూ..! నేను గుర్తున్నానా.. నా సాయం అప్పుడే మరిచారా?
Revanth Reddy On Tractor
Follow us on

ముఖ్యమంత్రి సారూ.. నమస్తే.. నేను గుర్తున్నానా.. మీరు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో.. బాసర ట్రిపుల్ ఐటీ ఆందోళన ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మీరు నా సాయమే తీసుకున్నారు. అప్పుడు మీరు నా ట్రాక్టర్ ఎక్కే విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా బాసర ట్రిపుల్ ఐటీ చేరారు. విద్యార్థుల‌ పక్షాన పోరాటం చేసేందుకు ఛలో ట్రిపుల్ ఐటీ అంటూ గర్జించి.. యూనివర్సిటీ గోడలు దూకి ఆందోళ‌నలో పాల్గొన్నారు. అంటూ నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీడియో సందేశాన్ని పంపారు.

బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో విద్యార్థులకు మద్దతుగా రైతు సహయ సాకారాలను‌ గుర్తించి మన ప్రభుత్వం వస్తే అన్ని‌ విధాల ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి.. రేవంత్ రెడ్డి, సీఎం అయి ఏడాది కాలం గడిచింది. కానీ‌ తనకు‌ మాత్రం న్యాయం జరగలేదంటూ.. ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతులందరికీ సాయం చేసినా, తనకు‌ రైతు భరోసా కల్పించలేదని, రైతు రుణమాపి కూడా కాలేదంటున్నారు. దయచేసి తన గోడు పట్టించుకుని న్యాయం చేయండి సర్ అంటూ నిర్మల్ జిల్లాకు చెందిన రైతు వీడియో విడుదల చేసి తన గోడును చెప్పుకున్నాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిర్మల్ జిల్లా బాసర మండలం లాబ్ది గ్రామానికి చెందిన సిందే పీరాజీ అనే రైతు రుణమాఫీ కాకపోవడంతో ఆవేదన చెందుతూ ఓ వీడియో విడుదల చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌ రైతుగా తాను చేసిన‌ సహాయాన్ని వివరిస్తూ, తనకు పరోపకారం చేయాలని ఆ వీడియోలో విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షంలో పీసీసీ ఛీప్ గా ఉన్న సమయంలో రెండేళ్ల క్రితం బాసర ఆర్జీయూకేటి విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా ట్రిపుల్ ఐటీలోకి గోడదూకొచ్చి విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఆ సమయంలో యూనివర్సిటీ వరకు అతి కష్టం మీద తీసుకెళ్లింది తానేనని.. తన ట్రాక్టర్ పైనే రేవంత్ రెడ్డిని తీసుకెళ్లానని.. ఆ సాయానికి ప్రతిపలం ఆశించలేదని, ఇప్పుడు‌ సీఎం గా రాష్ట్రాన్ని పాలిస్తున్న రేవంత్ రెడ్డి‌ సర్.. తాను చేసిన సాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ పథకంలో తన పంట రుణమాపి కాలేదని.. సీఎం రేవంత్ తనకు న్యాయం చేయాలని కోరాడు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..