అమ్మలగన్న అమ్మకు విశేష అర్చనలు.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగుతున్నాయి. దుర్గామాతను వివిధ రూపాల్లో ఆరాధిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. బాసర జ్ఞానసరస్వతి ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా మండపాల్లో అమ్మవార్లు కొలువుదీరారు. కాళికాదేవి, సప్తశృంగేరి, మహాకాళి రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

అమ్మలగన్న అమ్మకు విశేష అర్చనలు.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!
Devi Navaratri Adilabad

Edited By:

Updated on: Oct 13, 2026 | 8:24 AM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శక్తి స్వరూపిణి దుర్గ మాతను ఆరాధిస్తూ దేవీ శరన్ననవరాత్రి వేడుకలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తులు. ప్రతి ఏడాది ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దేవీ నవరాత్రులను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నవరాత్రులనే శరన్నవరాత్రులని, దసరా నవరాత్రులని, శారదీయ శరన్నవరాత్రులని, దుర్గానవరాత్రులని కూడా పిలుచుకుంటారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి ఆరాధిస్తున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. త్రిశూల ధారిణి, సింహావాహిని అయిన ఆ దుర్గాదేవిని తొమ్మిది రోజులపాటు శ్రద్దాభక్తులతో ఆరాధించి దసరా పండుగకు ఒక రోజు ముందు నిమజ్జనం చేయడంతో నవరాత్రి వేడుకలు ముగిస్తాయి.

ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ , కొమురంభీం జిల్లాల వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేలాది మండపాల్లో కొలువుదీరిన అమ్మవార్లు విభిన్న రూపాల్లో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల వేళ ఉమ్మడి జిల్లా కేంద్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జ్ఞాన సరస్వతి కొలువైన బాసరలో అంగరంగవైభవంగా శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు సాగుతున్నాయి. అటు కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ లోని కనకదుర్గా దేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో కనక దుర్గా దేవికి ప్రత్యేక‌పూజలు కొనసాగుతున్నాయి.

Devi Navaratri Adilabad

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొలువు దీరిన అమ్మవార్లు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. హనుమాన్ నగర్ లో అమ్మవారిని కాళీ దేవి రూపంలో మూడేళ్లుగా ప్రతిష్టించి కొలుస్తున్నారు. మంత్ర, తంత్ర పూజలతో శ్రీకాళికాదేవికి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కాశివిశ్వనాథ్, కామాక్య ఆలయాల నుండి వచ్చిన పండితలతో పూజ కార్యక్రమాలు సాగుతున్నాయి‌. అమ్మవారు ఉగ్రరూపంలో భక్తుల దర్శనిమిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీలో శ్రీ సప్తశృంగేరి అమ్మవారి అవతారంలో, తిరుపల్లి కాలనీలో చంద్రపురి మహాకాళిదేవి రూపంలో.. ద్వారకానగర్ లో దుర్గాదేవిగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా ప్రతిష్ఠించారు.

Devi Navaratri Adilabad 

ఇటు మంచిర్యాల జిల్లాలోని లక్షేట్టిపేటలోని సాంబశివాలయం హనుమాన్ ట్రస్ట్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో సింహవాహినిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఓ చోట అమ్మవారు శాంతంగా సింహ వాహనంపై దర్శనమిస్తే, మరొక చోట రౌద్రరూపంతో కాళికాదేవిలా దర్శనమిస్తున్నారు. మరొకచోట వృషభం తలపై కొలువుదీరి భక్తుల పూజలను అందుకుంటున్నారు. కాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్ లో ప్రతిష్టించిన కాళికాదేవి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహాశక్తివంతమైన దేవీగా కొలుస్తున్న కాళికాదేవిని కామాక్య మందిరంలో సాగే నిత్య పూజ తాంత్రిక విధానంలో పూజాధికార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Devi Navaratri Adilabad

ఈ దేవీ నవరాత్రుల్లో భాగంగా ఇలా ఆ కాళికాదేవిని ప్రతిష్టి పూజించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయని, అన్ని భయాలు తొలగిపోతాయని హనుమాన్ నగర్ కాళికాదేవి మండప నిర్వాహకులు చెబుతున్నారు. నవరాత్రి వేడుకలలో భాగంగా మూడవ ఏడాది అత్యద్భుత సెట్టింగ్ లతో మండపాన్ని ఏర్పాటు చేసి కాళికాదేవిని ప్రతిష్టించారు. బాసర జ్ఞానసరస్వతి ఆలయ పునఃనిర్మాణ నేపథ్యంలో బాలాలయంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడవ రోజు జ్ఞాన సరస్వతి అమ్మవారు చంద్రఘంట అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us