NIA Ride: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా ఎన్‌ఐఏ సోదాలు.. విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మీ తనిఖీలు

|

Mar 31, 2021 | 7:46 PM

NIA Ride: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఆకస్మిక దాడులు చేపట్టింది. విరసం, పౌరహక్కుల నేతల ఇళ్లల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది...

NIA Ride: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా ఎన్‌ఐఏ సోదాలు.. విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మీ తనిఖీలు
NIA
Follow us on

NIA Ride: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఆకస్మిక దాడులు చేపట్టింది. విరసం, పౌరహక్కుల నేతల ఇళ్లల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. కడప, పొద్దుటూరులో విరసం మాజీ కార్యదర్శి వరలక్ష్మీ ఇంట్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో అడ్వాకేట్‌ రఘునాథ్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. భీమాకొరెగావ్‌ కేసులో ఎన్‌ఐఏ భారీగా సోదాలు జరుపుతోంది. అలాగే డప్పు రమేష్‌ ఇంటిపై కూడా ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది.

దాడులను ఖండిస్తున్నాం..

కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఆకస్మిక దాడులపై పౌరహక్కుల నేత ప్రొ.హరగోపాల్‌ ఖండించారు. పౌరహక్కుల నేతలను భయపెట్టేందుకే దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భీమాకొరేగావ్‌ కేసులో ఇంకా ఎంత మందిని నిందితులుగా పెడతారని ఆయన ప్రశ్నించారు. భయపెట్టడం కోసమే భీమాకొరెగావ్‌ కేసును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ కంటేదారుణమైన పాలనలో ఉన్నామని ఆయన అన్నారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కమల్ హాసన్ కు కోపమొచ్చింది.. చేతిలో ఉన్న పార్టీ గుర్తును విసిరికొట్టాడు..!

Vijayasai Reddy send off wish : విధి నిర్వహణలో విఫలమైన నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్షలంట.!