CM KCR Birthday: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. రక్తదానం చేసిన మంత్రి హరీష్ రావు

|

Feb 16, 2022 | 1:58 PM

Harish Rao Donate Blood: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ గురువారంతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.

CM KCR Birthday: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. రక్తదానం చేసిన మంత్రి హరీష్ రావు
Harish Rao
Follow us on

Harish Rao Donate Blood: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ గురువారంతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు మూడు రోజులపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ (K. Chandrashekar Rao) జన్మదినాన్ని నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా మంగళవారం అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను (Blood Camps) నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి హరీష్ రావు (Harish Rao), ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు అని.. ఆయన పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని కొనియాడారు. కానీ కొంత మంది నాయకులు రక్తదాన శిబిరాలను రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు.

తలసేమియా వ్యాధిగ్రస్థులకు, గర్భిణీల కోసం రక్తం సేకరిస్తే.. కొంత మంది మూర్ఖులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ.. అభివృద్ధిలో నేడు దేశంలోనే ముందుందని పేర్కొన్నారు. విద్యుత్, సాగునీటితో పాటు వివిధ రంగాల్లో, సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు కాకులను కొట్టి గద్ధలకు వేసినట్టున్నదని ఎద్దేవా చేశారు. పేదలను దోచి పెద్దలకు అందింస్తుందంటూ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

రైతు సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. కావాలనే కొందరు సీఎం కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:

M KCR: వేడెక్కుతున్న దేశ రాజకీయాలు.. బీజేపీని ఢీకొట్టేందుకు ముంబైకి సీఎం కేసీఆర్..

TRS Vs BJP: తెలంగాణలో యూపీ ఎన్నికల వేడి.. మంత్రి కేటీఆర్-బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య మాటల యుద్ధం..