Mee Ticket: టికెట్ ఏదైనా.. యాప్ ఒక్కటే! హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌

మీ టికెట్ యాప్‌తో తెలంగాణలో ఆర్టీసీ, మెట్రో, పార్కులు, దేవాలయాల టికెట్లను ఇంటి నుంచే సులభంగా బుక్ చేయండి. వేసవిలో క్యూ లైన్లు లేకుండా, మీసేవ ద్వారా వచ్చిన ఈ యాప్ 219 ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. కేవలం ఒక క్లిక్‌తో ప్రయాణం, సందర్శన ప్రవేశ టికెట్లు పొందండి.

Mee Ticket: టికెట్ ఏదైనా.. యాప్ ఒక్కటే! హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌
Meticket App

Edited By:

Updated on: Apr 25, 2026 | 10:12 PM

వేసవి ఎండలో ఫ్యామిలీతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? మెట్రో ప్రయాణం, టెంపుల్ విజిట్, పార్కులు లేదా గోల్కొండ ఫోర్ట్ వంటి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే క్యూ లైన్లు భయం కాదు. తెలంగాణ ప్రభుత్వ మీ సేవ ద్వారా వచ్చిన మీ టికెట్ యాప్‌తో ఇంటి నుంచే అన్ని టికెట్లు ఒక్క క్లిక్‌లో బుక్ చేసుకోవచ్చు. మీ టికెట్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్సు, మెట్రో రైల్ టికెట్ల నుంచి పార్కులు, మ్యూజియంలు, టెంపుల్స్, ఫారెస్ట్ సఫారీల వరకు అన్ని ప్రవేశ టికెట్లు ఆన్‌లైన్‌లో పొందవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిస్తే సమీప EV ఛార్జింగ్ స్టేషన్లు కూడా ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు 219 లోకేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్లే స్టోర్‌లో “మీ టికెట్” సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌తో రిజిస్టర్ చేసి UPI ద్వారా చెల్లింపు చేయండి. ఎటువంటి అదనపు చార్జీలు లేవు.ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే 2.5 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. 6 లక్షలకు పైగా బుకింగులు, 4 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగాయి. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు త్వరలో మరిన్ని సేవలు జోడిస్తామని ప్రకటించారు. మీ సేవ కమిషనర్ టి. రవి కిరణ్ స్మార్ట్‌ఫోన్‌తోనే సౌకర్యవంతంగా బుక్ చేయమని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us