No Dowry Marriage: మీ వివాహానికి వరకట్నం వద్దనుకుంటున్నారా? స్వయంవరం

| Edited By: Rajeev Rayala

Dec 12, 2024 | 10:08 PM

Dowry: పెళ్లి జరిగిన తర్వాత కూడా కట్నకానుకుల విషయంలో ఎన్నో గొడవలు జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. వరకట్న వేధిపుల కారణంగా ఎంతో మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలున్నాయి..

No Dowry Marriage: మీ వివాహానికి వరకట్నం వద్దనుకుంటున్నారా? స్వయంవరం
Follow us on

వరకట్నం చట్టరీత్యా నిషేధం అని అందరికీ తెలిసిందే. అయినా కట్నాలు తీసుకోవడం ఏ మాత్రం ఆగడం లేదు. పెళ్లి అనగానే ఎంత కట్నం ఇస్తారు అనే మాట ముందుకు వస్తుంది. పెళ్లి జరిపే రెండు కుటుంబాలకు కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకోవడాలు నేరంగా కనబడవు. పెళ్లి జరిగిన తర్వాత కూడా కట్నకానుకుల విషయంలో ఎన్నో గొడవలు జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. వరకట్న వేధిపుల కారణంగా ఎంతో మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలున్నాయి.

యువత జీవిత భాగస్వామి ఎంపికలో ఆర్థిక లావాదేవీలకన్నా విద్యార్హతలు, సాంస్కృతిక సారూప్యతలు, అభిరుచుల కలయికలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఐ డోంట్‌ వాంట్‌ డౌరీ డాట్‌ కాం వెబ్‌సైట్‌ వ్యవస్థాపకుడు సత్యనరేష్‌ అన్నారు. వరకట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలన్న ఆదర్శాన్ని ఆచరణలో పెట్టేందుకు ‘ఐ డోంట్‌ వాంట్‌ డౌరీ డాట్‌ కాం’ను ఏర్పాటు చేయగా, అందులో 2 వేల మందికిపైగా వధూవరులు రిజిస్ట్రర్‌ చేసుకున్నారని ఆయన తెలిపారు.

ఐ డోంట్‌ వాంట్‌ డౌరీ డాట్‌కాలంలో రిజిస్ట్రర్‌ అయిన సభ్యుల్లో 40 శాతం మంది భాగస్వామి ఎంపికలో కులం పట్టింపు లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 18 స్వయంవరాలు నిర్వహించామని, ఈ వేదిక ద్వారా 100 వివాహాలు జరిగాయని వివరించారు. పెద్దలు నిశ్చయించిన వివాహాలతో పోలిస్తే కట్నం లేకుండా జరిగే వివాహాల్లోనే సక్సెస్‌ రేటు అధికంగా ఉందని ఆయన చెప్పారు.

ఆన్‌లైన్‌ ద్వారా స్వయంవరం:

ఈనెల 15న ఆన్‌లైన్‌ ద్వారా కట్నం వద్దనే వధూవరులకు ఉచితంగా స్వయంవరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ స్వయం వరంలో 200 మందికిపైగా పాల్గొంటారని, మిగతా వివరాల కోసం 9885810100 నంబర్‌కు సంప్రదించాలని ఆయన తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి