Local Body MLC Elections: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో వేడెక్కిన రాజకీయం.. జగ్గారెడ్డిపై సీఈవోకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు..

|

Dec 03, 2021 | 1:23 PM

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీలను ప్రలోభ పెడుతున్నారని ఎన్నికల సీఈవో శశాంక్ గోయల్‎కు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు...

Local Body MLC Elections: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో వేడెక్కిన రాజకీయం.. జగ్గారెడ్డిపై సీఈవోకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు..
Mlc Elecitons
Follow us on

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీలను ప్రలోభ పెడుతున్నారని ఎన్నికల సీఈవో శశాంక్ గోయల్‎కు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే నజరానా అంటూ జగ్గారెడ్డి ఫోన్లు చేశారని టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, భరత్ ఆరోపించారు. మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి జగ్గారెడ్డి భార్య నిర్మల గౌడ్ పోటీ చేస్తున్నారు. తమ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఎటు వెళ్లకుండా బెంగళూరులో టీఆర్ఎస్ క్యాంపు నిర్వహిస్తోంది. ముగ్గురు మంత్రులు అక్కడే మకాం వేశారు. స్థానిక సంస్థల సభ్యులకు బంధువుల నుంచి కాల్స్‌ రావడంతో ప్రజాప్రతినిధుల ఫోన్లు డిపాజిట్‌ చేసుకున్నారు. ఫోన్‌లు ఇవ్వకుంటే ఇంటికి వెళ్లిపోతామని వారు గొడవ చేయడంతో ఫోన్లు ఇచ్చారు.

కరీంనగర్‌లో చక్రం తిప్పడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ ఇండిపెండెంట్‎గా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ ఎంపీటీసీ, జడ్పీటీసీసీ, కౌన్సిలర్లకు ఆఫర్లు ఇస్తుందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, వరంగల్ ఒకటి, నల్గొండ ఒకటి, మెదక్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, ఖమ్మం ఒకటి, కరీంనగర్ జిల్లాల్లో రెండు, మహబూబ్‎నగర్ రెండు, రంగారెడ్డి జిలాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 10 వ తేదీన పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.

Read Also.. Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తమైన ప్రభుత్వం.. ఎయిర్ పోర్ట్‎లో నిఘా పెంపు..