Telangana: రోడ్డుపై వెళ్తుండగా ఏదో కదులుతూ కనిపించింది.. బైక్ చూస్తే గుండె ఆగినంత పనైందిగా.. వీడియో ఇదిగో..

రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై వాహనాలు రయ్‌రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి.. సరిగ్గా అదే సమయంలో అడవిలోంచి హఠాత్తుగా ఓ చిరుతపులి రోడ్డుపైకి దూసుకొచ్చింది.. బైక్‌పై వెళ్తున్న యువకుడు ఒక్క క్షణం బిత్తరపోయినా.. ప్రాణాలకు తెగించి ఆ దృశ్యాన్ని ఫోన్‌లో బంధించాడు. మెదక్ జిల్లా రామాయంపేట హైవేపై జరిగిన ఈ చిరుత హల్‌చల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Telangana: రోడ్డుపై వెళ్తుండగా ఏదో కదులుతూ కనిపించింది.. బైక్ చూస్తే గుండె ఆగినంత పనైందిగా.. వీడియో ఇదిగో..
Leopard Crossing Road In Medak

Edited By:

Updated on: Nov 09, 2026 | 9:25 PM

మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై పట్టపగలే చిరుత దర్జాగా రోడ్డు దాటుతూ కనిపించడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దంతేపల్లి గ్రామ శివారులో గల కాకుల గుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి – రామాయంపేట ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు సాగుతుండగానే.. సమీపంలోని గుట్టల నుంచి చిరుతపులి అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. ఎలాంటి భయం లేకుండా నెమ్మదిగా రోడ్డు దాటుకుంటూ అడవి వైపునకు వెళ్లిపోయింది. ఆ సమయంలో బైక్‌పై వెళ్తున్న ఓ స్థానిక యువకుడు ధైర్యం ప్రదర్శించి, చిరుతపులి రోడ్డు దాటుతున్న దృశ్యాలను తన స్మార్ట్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వాహనాలు వెళ్తున్న సమయంలోనే అంత సమీపంలో చిరుత కనిపించడంతో వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

దంతేపల్లి పరిసరాల్లో భయం గుప్పిట గ్రామాలు

చిరుత సంచారంతో దంతేపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిత్యం పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఈ ప్రాంత పరిసరాల్లో చిరుత అడుగుజాడలు, కదలికలు కనిపించిన దాఖలాలు ఉండటంతో స్థానికులు మరింత ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, చిరుత కదలికలను ట్రాక్ చేయాలని, బోన్లు ఏర్పాటు చేసి బంధించాలని గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

అటవీ శాఖ అధికారుల హెచ్చరికలు.. జాగ్రత్తలు

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ స్థానిక గ్రామాల ప్రజలకు పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, గ్రామస్థులు పొలాలకు లేదా అటవీ సమీప నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదు. పనులకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుంపులుగా మాత్రమే వెళ్లాలి. తెల్లవారుజాము వేళల్లో, రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పశువుల కాపరులు తమ పశువులు, మేకలు, గొర్రెలను జనావాసాలకు దగ్గరగా, సురక్షితమైన ప్రదేశాలలో ఉంచాలి. చిరుతపులి ఎక్కడైనా కనిపిస్తే దాని వెంటపడటం, రాళ్లతో కొట్టడం, వీడియోల కోసం అతిగా దగ్గరకు వెళ్లడం వంటి పనులు చేయకూడదు. అడవి జంతువులను రెచ్చగొడితే దాడి చేసే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us