KTR: కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు.. చరిత్ర పునరావృతం అవుతుంది.. కేటీఆర్ సంచలన ట్వీట్..

హస్తం పార్టీలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి.. మొదట్లో ముగ్గురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా.. ఇటీవల మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు..

KTR: కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు.. చరిత్ర పునరావృతం అవుతుంది.. కేటీఆర్ సంచలన ట్వీట్..
KTR Vs Revanth Reddy
Follow us

|

Updated on: Jun 24, 2024 | 1:36 PM

హస్తం పార్టీలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి.. మొదట్లో ముగ్గురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా.. ఇటీవల మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు.. అయితే.. కేసీఆర్ కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉండే వారే పార్టీను వీడుతుండటం.. ప్రస్తుత ఫిరాయింపు రాజకీయ పరిస్థితులపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చరిత్ర పునరావృతం అవుతుంది… అంటూ కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నామని వీర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కాంగ్రెస్ కు హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి ఎప్పుడు అధికారంలో ఉన్నవారి కన్నా కూడా బలంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు.. 2004-06 సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. అప్పుడు కూడా బీఆర్ఎస్ ఇబ్బందులను ఎదుర్కొంది. ఇలాంటి కష్టసమయాలు బీఆర్ఎస్ కు కొత్త కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ నీతి లేని వ్యవహారాలపై తెలంగాణ ప్రజలు ఆందోళనను ఉధృతం చేశారు. ఈ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ తల వంచక తప్పలేదన్నారు. ప్రస్తుతానికి తమ పార్టీ ఎమ్మెల్యేల ను ఫిరాయింపులకు పాల్పడేందుకు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. చరిత్ర పునరావృతం అవుతుంది.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్..

ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది మీరు కాదా..?

బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. పార్టీలో చేరికల మీద బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మట్లాడుతున్నారు.. భట్టి.. ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది మీరు కాదా..? అంటూ ప్రశ్నించారు. శాసనమండలిలో నా ప్రతిపక్ష నేత హోదా మీరు తొలగించలేదా..? అంటూ ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చేర్చుకుంది మీరు కాదా..? అంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో డిపాజిట్ పోయిందని ..ఇప్పుడు అనర్హత వేటు గురించి మట్లాడుతున్నారంటూ షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు.

కాగా.. పార్టీ ఫిరాయింపులతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. హస్తం పార్టీలో చేరిన వారిలో దానం నాగేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, సంజయ్ ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!