Ponguleti Srinivas Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఆయన ఏమన్నారంటే..

|

Dec 27, 2022 | 8:13 PM

బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు పొంగులేటి.

Ponguleti Srinivas Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఆయన ఏమన్నారంటే..
Ponguleti Srinivas Reddy
Follow us on

బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు పొంగులేటి. భద్రాద్రి కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం నిజం కాదని, తాను బీఆర్ఎస్‌ లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని, ఉండాలని కోరుకుంటున్నానని కూడా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే పోటీ ఖాయం ప్రకటించారు కూడా. ఉమ్మడి జిల్లాల్లో మూడు జనరల్ స్థానాలు కొత్తగూడెం, పాలేరు, ఖమ్మంలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి పోటీ చేసే ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు ఖచ్చితంగా పోటీ చేస్తారని ప్రకటించారు. కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రేగా కాంతారావు మధ్య విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేగా వ్యతిరేకకులను దగ్గరకు తీస్తున్నారు పొంగులేటి.

గతంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలోనూ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవ.. కేసుల వరకు వెళ్లింది. కాగా, రేగా కాంతారావు ఓటమి కోసం పొంగులేటి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి వ్యవహారంపై రేగా గుర్రుగా ఉన్నారు. పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా పర్యటనలు చేస్తూ..తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..